ఫిబ్రవరి 17 శనివారం 2018..మీ రాశి ఫలాలు

Published : Feb 17, 2018, 07:36 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఫిబ్రవరి 17 శనివారం 2018..మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వలన ఇబ్బందిపడే అవకాశముంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం.

వృషభం

వృషభం : ఈ రోజు కొత్త పనులు ప్రారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన పయత్నం ఒక కొలిక్కి వస్తుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు. అత్యుత్సాహానికి పోకుండా, ఆలోచనతో పనులు పూర్తి చేయండి.

మిథునం

మిథునం :ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో, గృహ, భూ సంబంధ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా నష్టపోయే అవకాశముంటున్నది. అలాగే మీ శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వారి కారణంగా మీపై అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇబ్బంది కలిగించవచ్చు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేతులు, చెవి, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.

కన్య

కన్య : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతున్నది. గృహసంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మీ తల్లి తరపు బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

తుల

తుల : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మారు్పుకానీ ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించటం కానీ చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం : ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు, భూ సంబంధ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కొరకు ఎదురుచూస్తున్న వారికి ఈరోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులు, బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మకరం

మకరం : ఈరోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కుంభం

కుంభం : ఆర్థికంగా ఈరోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 

మీనం

మీనం : ఈరోజు కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వాయిదా వేయటం చేస్తారు. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవటం మంచిది. ఖర్చుల విషయంలో ఆచి తూచి అడుగేయండి. గొప్పలకుపోయి డబ్బులు ఖర్చు చేసుకోకండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu