13ఫిబ్రవరి మంగళవారం 2018..మీ రాశి ఫలాలు

Published : Feb 13, 2018, 08:22 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
13ఫిబ్రవరి  మంగళవారం 2018..మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : వ్యాపారంలో, మీరు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. మీ ప్రతిభను చూ పించాల్సిన సమయమిది. కొత్తవారితో పరిచయాలకు, స్నేహాలకు అనుకూలమైన రోజు. ఇతరుల ప్రభావానికి, ఒత్తిడికి లోను కాకండి. దానితో అనవసర సమస్యలు ఏర్పడతాయి.

వృషభం

వృషభం: ఈ రోజు కొత్త వారితో పరిచయం కానీ లేదా విదేశీయానానికి సంబంధించి ముఖ్య సమాచారం కానీ అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ఉంటాయి.

మిథునం

మిథునం : ఈ రోజు ప్రతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది.

కర్కాటకం

కర్కాటకం : మీ మిత్రులను కలుసుకుంటారు. ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

సింహం

సింహం : ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్ర త్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

కన్య

కన్య : అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి.

తుల

తుల : ఈ రోజు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం తగ దు. భోజనం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వలన ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడే అవకాశముం ది. బద్ధకానికి, అసహనానికి తావివ్వకండి. ఏ పని అయినా పూర్తి శ్రద్ధాసక్తులతో పూర్తి చేయండి.

వృశ్చికం

వృశ్చికం : మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచి త నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. మీ పిల్లల గు రించి శుభవార్త వింటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

ధనుస్సు :

ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దానితో మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది.

మకరం

మకరం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశముంది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉం డాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

కుంభం

కుంభం : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒంటరితనానికి లోనవుతారు. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

మీనం

మీనం :ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu