ఏప్రిల్ 14, 2018 శనివారం మీ రాశిఫలాలు

Published : Apr 14, 2018, 09:26 AM IST
ఏప్రిల్ 14, 2018 శనివారం మీ రాశిఫలాలు

సారాంశం

శుభవార్త వింటారు.

మేషం

మేషం : ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కం టికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికం గా ఉంటుంది. శివారాధన చేయటం మంచిది. చేపట్టిన పనులు చిన్న చిన్న అడ్డంకులతో పూర్తవుతాయి.

వృషభం

వృషభం : ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైన వారితో గడుపుతారు. బంధుమిత్రుల రాకపోకలు, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం అలాగే పాత మిత్రులను కలవటం జరుగుతుంది. సమయానికి డబ్బు అందటం వలన ఆర్థిక సంబంధ సమస్య తొలిగిపోతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలిగిపోతాయి.

మిథునం

మిథునం : ఈ రోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది . అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. మీ స్నేహితుల ను కలుసుకుంటారు. ఆవేశానికి లోను కాకుండా ఉండాలి

కర్కాటకం

కర్కాటకం : ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి.. మీ సంతానం గురించి కానీ, ఏదైనా పోటీ విషయంగా కానీ డబ్బు ఖర్చవుతుంది.

సింహం

సింహం : ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వాహనం లేదా ఇంటికి సంబంధించిన ఒప్పందాలు, అమ్మకాల కారణంగా ధనలాభం కలుగుతుంది. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. మీ మిత్రులతో లేదా బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగవుతుంది.

కన్య

కన్య : మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతా రు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. శివారాధన చేయటం మంచిది. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు కొలిక్కి వస్తాయి. 

తుల

తుల : మీరు అనుకున్న పనులు పూర్తి చేయటానికి, కొత్త పను లు ప్రారంభించటానికి అనుకూలమైన రోజు. అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం. పాత మిత్రులను కలవటం జరుగుతుంది.

ధనుస్సు :

ధనుస్సు : ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం

మకరం : ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సం బంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. అలాగే రుచికరమైన భోజనం చేస్తారు.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

కుంభం

కుంభం : మీరు చేసే పనుల్లో అవరోధాలు ఏర్పడతాయి. ము ఖ్యంగా మీ కార్యాలయంలో మీరు చేయాలనుకున్న పనికి సహోద్యోగుల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఆవేశానికి లోను కాకుండా సామరస్య పూర్వకంగా వ్యవహరించండి. శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విశ్రాంతి అవసరం.

మీనం

మీనం : అదృష్టం కలిసివచ్చే రోజు. ఆహ్లాద కరమైన రోజు. ఇష్టమైన వారితో గడుపుతారు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు. మీ స్నేహితులను కలుసుకుంటారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu