ఏప్రిల్ 08, 2018 ఆదివారం మీ రాశిఫలాలు

Published : Apr 08, 2018, 08:27 AM IST
ఏప్రిల్ 08, 2018 ఆదివారం మీ రాశిఫలాలు

సారాంశం

ఆనందంగా గడుపుతారు

మేషం

మేషం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటుతో డబ్బు నష్టపోయే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్ర చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ సంతానం వల్ల ఆనందం పొందుతారు. వివాహ సంబంధ విషయాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు.

వృషభం

వృషభం : ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపాల్సి రావడం, ఏదైనా అడ్డంకి ఎదురవడం జరగవచ్చు. ఇతరులతో కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

మిథునం

మిథునం :మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలు, కమ్యునికేషన్‌కు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం

కర్కాటకం :ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహసంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. తల్లిగారి తరఫు బంధువులను కలుసుకోవచ్చు. గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు, ఇతర లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు, వివాదాలు పరిష్కారమవుతాయి.

సింహం

సింహం : ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూలం కాదు. ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించే అవకాశం ఉంది.

కన్య

కన్య :పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు, భూ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళన, ఆవేశానికి గురికావద్దు. ప్రశాంత చిత్తంతో అన్ని పనులు చేయగలుగుతారు.

తుల

తుల : అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరంగా మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.

వృశ్చికం

వృశ్చికం :మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయడానికి బద్దకిస్తారు. ముఖ్య పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు :

ధనుస్సు : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులు , స్నేహితులను కానీ కలుసుకుంటారు. గృహ సంబంధ లావాదేవీలు, ఒప్పందాలు పూర్తి చేస్తారు.

మకరం

మకరం :బద్దకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాలవల్ల భవిష్యత్‌లో ఇబ్బంది పడే అవకాశముంటుంది.

కుంభం

కుంభం :ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో గడిపే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు.

మీనం

మీనం : ఏదైనా కొత్త పని చేపట్టడానికి చాలా అనుకూలమైనది. ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. స్త్రీల విషయంలో కల్పించుకోకండి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu