ఏప్రిల్ 03, 2018 మంగళవారం మీ రాశిఫలాలు

Published : Apr 03, 2018, 09:38 AM IST
ఏప్రిల్ 03, 2018 మంగళవారం మీ రాశిఫలాలు

సారాంశం

ధనలాభం ఉంటుంది.

మేషం

మేషం: మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. అలాగే ప్ర యాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభ కార్యాలలో పాల్గొంటారు. రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యో గ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

వృషభం

వృషభం : ఉద్యోగ, ప్రయాణం విషయంలో కానీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి..

మిథునం

మిథునం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవడం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించడం చేస్తారు.

కర్కాటకం

కర్కాటకం : ఆరోగ్యం విషయంలో ఇబ్బంది ఉంటుంది. కడు పు లేదా ఛాతి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయవచ్చు. గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్య ఎక్కువగా బాధిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్య విషయం లో కూడా కొంత జాగ్రత్త అవసరం. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు. ఎక్కువసేపు కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

సింహం

సింహం : మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు.

కన్య

కన్య: ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉం డటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుం ది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మాట విషయంలో జాగ్రత్త అవసరం.

తుల

తుల : మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి.

ధనుస్సు :

ధనుస్సు : ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహా యం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. అనుకోని శుభపరిణామాలుంటాయి.

మకరం

మకరం : మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మా ర్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారులను కలవటానికి అనుకూల దినం.

కుంభం

కుంభం : మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

మీనం


మీనం : మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతా యి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. అపోహలు, అపార్థాల కారణంగా బంధువుల తో వివాదాలు ఏర్పడతాయి. . నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu