7 జూన్ 2018 గురువారం మీ రాశిఫలాలు

Published : Jun 07, 2018, 09:33 AM IST
7 జూన్ 2018 గురువారం మీ రాశిఫలాలు

సారాంశం

ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది

మేషం

మేషం: ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. చెప్పుడు మాటలను పట్టించుకోకండి. ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శిస్తారు.

వృషభం

వృషభం : కొత్త పనులు ప్రారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం.

మిథునం

మిథునం : ఆర్థిక వ్యవహారాలలో, గృహ మరియు భూ సంబంధ లావాదేవీలలో జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వారి కారణంగా మీ పై అధికారులు కానీ, నాయకులు కానీ ఇబ్బంది కలిగించవచ్చు. బంధు వులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది.

కర్కాటకం

కర్కాటకం : ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్ కు అనుకూల దినం.

కన్య

కన్య : ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహ సంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకుంటారు. మీ గృహానికి సం బంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు పరిష్కారమౌతాయి.

తుల

తుల : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయం లో జాగ్రత్త అవసరం. దూరప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు.

వృశ్చికం

వృశ్చికం : పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించి న విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో పనులు చేయగలుగుతారు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్ర మోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మకరం

మకరం : మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. బంధు వులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.

కుంభం

కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయి లు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనతో పనులు పూర్తి చేయండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.

మీనం

మీనం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వా యిదా వేయటం చేస్తారు. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవటం మంచిది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి అడుగేయండి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu