జనవరి 31 బుధవారం 2018..మీ రాశి ఫలాలు

Published : Jan 31, 2018, 08:31 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
జనవరి 31 బుధవారం 2018..మీ రాశి ఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : ఈ రోజు పనుల విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కొంటారు. మానసిక స్ఠైర్యాన్ని కోల్పోకుండా ఎక్కువసార్లు ప్రయత్నిస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యవిషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరాలు, మెడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశముంది.

వృషభం

వృషభం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా టాన్సఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మిథునం

మిథునం : ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాసముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావడం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవడం కానీ జరుగవచ్చు. ఇతరులతో కొంత జాగ్రత్త అవసరం.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆం దోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనం దంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.

సింహం

సింహం : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.

కన్య

కన్య : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. ఉద్యోగంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

తుల

తుల : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభంచేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలిగి పోతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విదేశీసంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శతృవులమీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తొలిగి పోతాయి. మీ భాగస్వామి నుంచి సహాయం అందుకుంటారు.

కుంభం : ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులు కలుస్తారు. ఆర్థిక సంబంధ లావాదేవీలు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. ఆచితూచి అడుగేయడం మంచిది. శతృబాధ తొలగి పోతుంది

మీనం

మీనం : ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరాలు, కడుపుకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశముంటుంది. మీ జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. బంధువుల కారణంగా లేదా వాహన కారణంగా డబ్బు ఖర్చవుతుంది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu