19 మే 2018 శనివారం మీ రాశిఫలాలు

Published : May 19, 2018, 09:48 AM IST
19 మే 2018 శనివారం మీ రాశిఫలాలు

సారాంశం

ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది

మేషం

మేషం: ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వలన ఇబ్బందిపడే అవకాశముంటుంది. పుకార్లను. చెప్పుడు మాటలను పట్టించుకోకండి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం.

వృషభం

వృషభం: కొత్త పనులు ప్రారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఓ కొలిక్కి వస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

మిథునం

మిథునం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో, గృహ, భూ సంబంధ లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. వారి కారణంగా మీ పై అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు ఇబ్బంది కలిగించవచ్చు.

కర్కాటకం

కర్కాటకం : ఈరోజు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కొరకు, కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యూనికేషన్‌కు అనుకూల దినం.

కన్య

కన్య : ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహ సంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరఫు బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు, ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు పరిష్కరించబడతాయి.

తుల

తుల : ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవదర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించటం కానీ చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం : పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు, భూసంబంధ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, బదిలీ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులు, బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మకరం

మకరం : మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.

కుంభం

కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీనం

మీనం: కొంత బద్ధకంగా ఉంటుంది. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవటం మంచిది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి అడుగేయండి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu