వాట్సాప్ లో ఎవరు బ్లాక్ చేశారో.. ఇలా తెలుసుకోవచ్చు

First Published Jan 10, 2018, 2:22 PM IST
Highlights
  • వాట్సాప్‌లో ఎవరైనా యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే వారి స్టేటస్ మీకు కనిపించదు.

ప్రముఖ మొబైల్ మేసేజింగ్ యాప్.. వాట్సాప్ గురించి తెలియని వాళ్లు ఉండరు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్ ఉంటుంది.  ఈ వాట్సాప్ లో చాటింగ్, కాల్స్, వీడియో కాలింగ్ లాంటి ఫీచర్లతోపాటు బ్లాక్ ఫీచర్ కూడా ఉంది. దీని గురించి కూడా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. మనకు నచ్చని  వాళ్లు ఎవరైనా మెసేజ్ చేస్తే వారిని ఈ ఆప్షన్ ద్వారా బ్లాక్ చేయవచ్చు. అయితే.. మిమ్మల్ని కూడా ఎవరైనా బ్లాక్ చేసే ఉండిఉండొచ్చు. మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవడం ఇప్పుడు సులభం. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

1. వాట్సాప్‌లో ఎవరైనా యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే వారి స్టేటస్ మీకు కనిపించదు. అంటే వారు ఆన్‌లైన్‌లో ఉన్నారా, ఆఫ్‌లైన్‌లో ఉన్నారా అనే విషయం మీకు తెలియదు. అయితే ఈ సెట్టింగ్ బ్లాక్ చేయకపోయినా అందరికీ అందుబాటులో ఉంటుంది. కాకపోతే బ్లాక్ చేస్తే మాత్రం సదరు యూజర్ స్టేటస్ మీకు కనిపించదు. దీంతో మిమ్మల్ని ఆ యూజర్ బ్లాక్ చేశారని తెలుసుకోవాలి. 

2. ఎవరైనా యూజర్ వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేస్తే మీరు ఆ యూజర్‌కు చెందిన ప్రొఫైల్‌ను చూడలేరు. ప్రొఫైల్ బొమ్మపై క్లిక్ చేసినా బ్లాంక్ సర్కిల్ వస్తుంది. ఎలాంటి ఫొటో కనిపించదు. ఇలా ఉన్నా మిమ్మల్ని అవతలి వ్యక్తి బ్లాక్ చేశాడని గుర్తించాలి. 

3. ఎవరైనా ఒక యూజర్‌కు మీరు ఏదైనా మెసేజ్ పంపితే దానికి కేవలం సింగిల్ టిక్ మాత్రమే చూపిస్తుంటే అప్పుడు మిమ్మల్ని ఆ యూజర్ బ్లాక్ చేసినట్టు తెలుసుకోవాలి. బ్లాక్ చేయకపోతే మెసేజ్ డెలివరీ అయినట్టు డబుల్ టిక్ వస్తుంది. యూజర్ ఆ మెసేజ్‌ను చూశాక బ్లూ టిక్ కనిపిస్తుంది. 

4. మీ స్మార్ట్‌ ఫోన్‌లో మొబైల్ డేటా లేదా వైఫై సిగ్నల్ బాగానే ఉన్నప్పటికీ మీరు వాట్సాప్‌లో ఎవరికైనా వాయిస్ లేదా వీడియో కాల్ చేస్తే అది కలవకపోతే అప్పుడు ఆ యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు గుర్తించాలి.

click me!