ఆమెది అధికారం, ఆయనది పెత్తనం: కాకినాడ రూరల్ కథ

Published : Jul 01, 2017, 11:43 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఆమెది అధికారం, ఆయనది పెత్తనం: కాకినాడ రూరల్  కథ

సారాంశం

పేరుకే పదవుల్లో ఉండేది భార్యలు గాని, హోదా వెలగబెట్టేది భర్తలే. ఇక్కడ ఈ పోటోలలో చూడండి, ఒక భర్త ఎంత అధికార హోదా వెలగబెడుతున్నాడో. కారణం,చిన్నదే. ఆయన భార్య తెలుగుదేశం ఎమ్మెల్యే.  ఆమె ఇల్లు తీసుకుని, నియోకవర్గం భర్తకు వదిలిపెట్టింది. అందుకే ఆ ఏరియాలో అలిది అధికారం, భర్తది పెత్తనం అనే మాట అక్కడ క్కడా వినబడుతూ ఉంటుంది.

పేరుకే పదవుల్లో ఉండేది భార్యలు గాని, హోదా వెలగబెట్టేది భర్తలే. ఇక్కడ ఈ పోటోలలో చూడండి, ఒక భర్త ఎంత అధికార హోదా వెలగబెడుతున్నాడో. కారణం,చిన్నదే. ఆయన భార్య తెలుగుదేశం ఎమ్మెల్యే.  ఆమె ఇల్లు తీసుకుని, నియోకవర్గం భర్తకు వదిలిపెట్టింది. అందుకే ఆ ఏరియాలో అలిది అధికారం, భర్తది పెత్తనం అనే మాట అక్కడ క్కడా వినబడుతూ ఉంటుంది. ఈ రోజు సాక్షి ఆయన హోదా గురించి ఆసక్తికరమయిన కథనం వెల్లడించింది.

 

అదొక తెల్ల స్కార్పియో వాహనం.  ‘ఎమ్మెల్యే కాకినాడ రూరల్‌’ అనే స్టిక్కర్‌ తో యమస్పీడ్ తో దూసుకొచ్చింది అక్కడ ఆగింది. అంతా ఎమ్మెల్యేయమ్మ వచ్చిందనుకున్నారు. తీరా డోర్‌ తెరిచి వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌తో దిగిందేమో ఆమె భర్త గారు. ఆయన పేరు పల్లి సత్తిబాబు గారు. భార్య గారి పేరు పిల్లి అనంత లక్ష్మి గారు.

 

ఆయన చిరుచినుకుల్లో బండి దిగాడో లేదో  వెంటనే పక్కన ఉన్న గన్‌మెన్‌ గొడుగు పట్టాడు. ఇది చూసినవారంతా ‘ఓర్ని...ఎమ్మెల్యే అనుకున్నామే అని అక్కడికొచ్చిన అమాయక జనం కొద్ది సేపు కన్ ఫ్యూజ్ అయ్యారు. ఎమ్మెల్యేగారి భర్తగారు  ఏం బిల్డప్‌ ఇచ్చార్రా బాబూ! అని ఆశ్చర్యపోయారు.

 

అధికారంలో కూడా చక్కగా భర్తకు పంచి అమె నిజమయిన అర్ధాంగి అయిపోయారు. అందుకే ’ఆలిది అధికారం... పెనిమిటి పెత్తనం‘ అనే మాట కాకినాడ రూరల్‌ మండలంలో విస్తృతంగా వినిపిస్తుందని సాక్షి రాసింది. ఎమ్మెల్యే భర్త గారి  హడావుడి ఇంత అంత కాదుట.  ఆమె సభ్యత్వం అసెంబ్లీలో, వుండేది ఇంటిలో, నియోజకవర్గం పెత్తనం భార్య ది అని తెగజోకులక్కడ.


 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !