వాలంటైన్స్ డే కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి..? ఇదిగో ఆన్సర్

First Published Feb 8, 2018, 3:57 PM IST
Highlights
  • ఎలాంటి బహుమతి ఇవ్వాలనుకుంటారు? ఏమివ్వాలో బుర్రకు తట్టడం లేదా.. అయితే.. ఈ స్టోరీ మీకోసమే

ప్రేమ అనేది ఒక తీయని అనుభూతి. దీనిని ప్రేమికులు నిత్యం ఆస్వాధిస్తుంటారు. అయితే.. అన్ని రోజులతో పోలిస్తే.. ప్రేమికుల రోజు( వాలంటైన్స్ డే) మాత్రం వారికి చాలా ప్రత్యేకం. అందుకే.. ఆరోజు వారంతా తమ లవర్ తోనే గడపాలని భావిస్తుంటారు. ఈ ప్రేమికుల రోజు.. మరెంతో దూరంలోలేదు. ప్రస్తుతం ప్రేమికులంతా.. ఒకే విషయం గురించి తెగ ఆలోచిస్తుంటారు. వాలంటైన్స్ డే రోజు తమ లవర్ కి ఏలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అని..? ఇప్పటికే కొందరు గిఫ్ట్ లు కొనేసుంటారు. మరికొందరేమో.. ఇంకా ఏమి కొనాలా అని ఆలోచిస్తుంటారు. మరి ఎలాంటి బహుమతి ఇవ్వాలనుకుంటారు? ఏమివ్వాలో బుర్రకు తట్టడం లేదా.. అయితే.. ఈ స్టోరీ మీకోసమే ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

గిఫ్ట్ మెమరీస్...

ఈ మెమరీస్ ని గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. అర్థం కాలేదా..? మీరు మీ ప్రియుడు/ ప్రియురాలు తో గతంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫోటోలు దిగే ఉంటారు. వాటిల్లోని కొన్ని సెలక్ట్ డ్ ఫోటోస్ అన్నింటినీ కలిపి ఒక ఫ్రేమ్ తయారు చేయండి. దానిని గిఫ్ట్ గా ఇవ్వండి. ఆ గిఫ్ట్ చూడగానే మీరు గడిపిన పాత క్షణాలన్నీ మీ లవర్ కి ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. చాలా ఆనందపడతారు.

చీర నచ్చని అమ్మాయి ఉండదు..

మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే.. ఆమెకు ఒక చీర గిఫ్ట్ గా ఇవ్వండి. ప్రస్తుత కాలంలో చాలా రకాల చీరలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మీ గర్ల్ ఫ్రెండ్ కి ఎలాంటి చీర నప్పుతుందో అది గిఫ్ట్ గా ఇవ్వండి. చీర నచ్చని అమ్మాయిలు ఎవరు ఉంటారు చెప్పండి. బాయ్ ఫ్రెండ్ కి అయితే.. తనకు నచ్చిన కలర్ షర్ట్ గిఫ్ట్ గా ఇవ్వండి.

యాక్ససరీస్..

ఇష్టమైన రిస్ట్ వాచ్, ఖరీదైన స్మార్ట్‌ఫోన్, అందమైన హ్యాండ్ బ్యాగ్.. ఇలాంటివాటిని గిఫ్ట్‌ లుగా ఇచ్చేయొచ్చు. కావాలంటే ముందుగానే కొరియర్ చేసి, మీరే పంపించిన విషయాన్ని సస్పెన్స్‌ గా ఉంచి, ఫిబ్రవరి 14న రివీల్ చేయొచ్చు. లేదంటే ఓ చక్కని సాయంత్రం వేళ తనను ఇష్టమైన సినిమాకు తీసుకెళ్లి.. ఇంటర్వెల్ సమయంలో స్క్రీన్‌పై మీ ప్రేమ సందేశాన్ని డిస్‌ప్లే చేయించి, ఆశ్చర్యంలో ముంచెత్తవచ్చు. లేదంటే.. దగ్గర్లోని బీచ్‌కి తీసుకెళ్లి మీ మనసులోని మాటను చెప్పేయొచ్చు..

click me!