నల్గొండ రిషిత కు రెండేళ్లు...

First Published Dec 6, 2017, 3:14 PM IST
Highlights
  • డాక్టర్ యాదయ్య, అతని బృందం పాపని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు.

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం అంటే 2015వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు రిషిత. ఆ పాప పుట్టినప్పుడు బరువు ఎంతో తెలుసా.. కేవలం 650గ్రాములు. బతకడం చాలా కష్టమని భావించారంతా. కానీ యూనిసెఫ్ ఆ పాప ప్రాణాలను కాపాడింది. ఆ పాపని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ ( ఎస్ఎన్ సీయూ) లో ఉంచారు. డాక్టర్ యాదయ్య, అతని బృందం పాపని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు.

రిషిత ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వచ్చారు. రిషితకు బలం వచ్చేలా చాలా ప్రయత్నాలు చేశారు. ఎప్పుడూ వెచ్చగా ఉండేలా రూమ్ ఏర్పాటు చేసి అందులోనే ఉంచేవారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఎలాంటి శబ్ధాలు వింటుందో అలాంటివే వినిపించేవారు. ఇప్పుడు రిషిత పూర్తిగా కోలుకుంది. తనకు ఇప్పుడు రెండు సంవత్సరాలు నిండబోతున్నాయి. తన తల్లిదండ్రులతో చాలా సంతోషంగా ఉంది. రిషితకు వైద్యులు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చారో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. రిషిత లాంటి ఎందరో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు. వారందరికీ కూడా ఇలాంటి చికిత్స అందించాలని యూనిసెఫ్ కోరుకుంటోంది. అందుకు దాతలు ఎవరైనా ఉంటే ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ యూనిసెఫ్ ఈ వీడియో విడుదల చేసింది.

 

click me!