రంగుచూసి.. చరిత్ర చెప్పేయచ్చు..!

First Published Nov 28, 2017, 3:50 PM IST
Highlights
  • కోడిగుడ్డులో అనేక పోషక విలువలు ఉన్నాయి.
  • పిల్లల శారీరక ఎదుగుదలకు ఉడికించిన కోడిగుడ్డు చాలా ఉపయోగపడుతుంది

రోజుకో కోడిగుడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని వయస్సుల వారి ఆరోగ్యానికీ కోడిగుడ్డు బ్రహ్మాండంగా దోహదపడుతోంది. కోడిగుడ్డులో అనేక పోషక విలువలు ఉన్నాయి. పిల్లల శారీరక ఎదుగుదలకు ఉడికించిన కోడిగుడ్డు చాలా ఉపయోగపడుతుంది.అయితే.. కోడి గుడ్డు అనగానే ఉడికించినదే తినాలనేమీ లేదు. ఆమ్లెట్, ఎగ్ పౌచ్, హాఫ్ బాయిల్డ్, ఫ్రైడ్ ఇలా ఏదో రకంగా తీసుకోవచ్చు. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో ఏదో రకంగా కోడిగుడ్డును చేర్చితే చాలా మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. ఇందులో 11 రకాల ఆమ్లాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీనులు, విటమిన్‌ ఏ, బీ, డీ, ఈ, కాల్షియం, ఫాస్ఫరస్‌, జింక్‌, తదితర పలు రకాల పోషక పదార్థాలు గుడ్డులో సమృద్ధిగా ఉన్నాయి. గుడ్డులోని విటమిన్‌ ఏ కంటి చూపు మెరుగుపర్చడానికి, విటమిన్‌ డీ ఎముకల ధృదత్వానికి, విటమిన్‌ ఈ కాన్సర్‌ నుండి కాపాడడంతోపాటు గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి.

కానీ మీరు ఎప్పుడైనా గమనించారా అన్ని కోడిగుడ్డు సొనలు ఒకేలా ఉండవు. కొన్ని గుడ్డుల్లో సోన ఎక్కువ పసుపు రంగులో ఉంటే. మరికొన్ని తక్కువ పసుపు రంగులో ఉంటాయి. ఈ రంగులో తేడాని బట్టి మనం గుడ్డు నాణ్యతను చెప్పొచ్చు. అంతేకాదు పచ్చసొన రంగునిబట్టి  ఆ గుడ్డులో ఉన్న పోషక విలువలను కూడా చెప్పవచ్చు. కోడి తీసుకున్న ఆహారాన్ని బట్టి కోడిగుడ్డులోని పచ్చ సొన రంగు ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పోషకాహార నిపుణురాలు క్యాతిరూపాని తెలిపిన వివరాల ప్రకారం.. కోడిగుడ్డు పచ్చసొన కనుక డార్క్ ఎల్లో కలర్ లో ఉంటే.. దానిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకం కోడిగుడ్డు అందించిన కోడి న్యూట్రీషియన్స్, బాలెన్స్ డ్ డైట్ ఫాలో అయ్యిందని అర్థం.   అలాకాకుండా గుడ్డు పచ్చసొన ఆరెంజ్ రంగులో కనుక ఉంటే అందులో విటమిన్ ఏ, బీటా క్యారటోన్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఈ రకం కోడిగుడ్డు అందించిన కోడి.. ఎక్కువ మొత్తంలో క్యారెట్ వంటి ఆహారం తీసుకుందని అర్థం. ఈ రకం కోడిగుడ్డులోనూ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

ఇక కోడిగుడ్డు పైపొర విషయానికి వస్తే.. కొన్ని గుడ్లు తెల్లగానూ మరికొన్ని ఇతర రంగుల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. అలా రంగులు తేడాగా ఉండటానికి గల కారణం జనటిక్స్ అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వాతావరణం మీద కూడా గుడ్డు రంగు ఆధారపడి ఉంటుంది.

బ్రైట్ వైట్ కలర్ లో ఉన్న ఎగ్ మాత్రం ఫ్రెష్ అని చెప్పవచ్చు. అలా బ్రైట్ వైట్ లో ఉంటే.. దానిని ఎక్కువ రోజులు స్టోర్ చేయలేదని అర్థం చేసుకోవచ్చు. గుడ్డులోపలి సొనల ఆధారంగా గుడ్డు ఫ్రెష్ అవునో కాదో చెప్పలేం కానీ.. కోడి ఎలాంటి ఆహారం తీసుకుందో మాత్రం చెప్పవచ్చు. కోడి కనుక మంచి ఆహారం తీసుకుంటే.. గుడ్డు సొన చాలా బ్రైట్ గా ఉంటుంది.

 

click me!