రాష్ట్రపతికే దిక్కులేదా ?

Published : Dec 06, 2016, 10:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
రాష్ట్రపతికే దిక్కులేదా ?

సారాంశం

సాంకేతిక లోపం వల్ల చెన్నైలో దిగాల్సిన విమానం దిగలేకపోయింది. సరే, మరి ఢిల్లీలో కూడా దిగలేకపోతే అప్ప్పడు రాష్ట్రపతి పరిస్ధితి ఏమిటి?

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకే దిక్కులేదు మనదేశంలో. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ప్రణబ్ ఢిల్లీ నుండి చెన్నైకు బయలుదేరారు. జయలలిత పార్దివ దేహానికి నివాళులర్పించటానికి రాష్ట్రపతి మంగళవారం ఉదయం బటయలుదేరారు.

 

అయితే, చెన్నైకు చేరుకున్న విమానాన్ని విమానాశ్రయంలో దింపటానికి ప్రయత్నించినపుడు సాంకేతిక లోపం బయటపడింది. దాంతో విమానం చెన్నై విమానాశ్రయంలో దిగకుండానే తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయింది. వేరే విమానంలో ప్రణబ్ చెన్నైకు చేరుకున్నారు. 

 

అయితే, అందరినీ ఆశ్చర్యపరిచిందేమిటంటే, ప్రణబ్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తటం. సాక్షాత్తు రాష్ట్రపతి ప్రయాణిస్తున్న విమానంలోనే సాంకేతిక లోపం తలెత్తిందంటే ఇక సామాన్యులకు దిక్కెవరు?

 

రాష్ట్రపతి ప్రయాణిస్తున్నారంటే ముందుగా విమానాన్ని తనిఖీ చేయరా అన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. సాంకేతిక లోపం వల్ల చెన్నైలో దిగాల్సిన విమానం దిగలేకపోయింది. సరే, మరి ఢిల్లీలో కూడా దిగలేకపోతే అప్ప్పడు రాష్ట్రపతి పరిస్ధితి ఏమిటి?

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !