
కేరళ బాధితులను ఆదుకోవడంలో టిడిపి ఎమ్యెల్యే బోడెప్రసాద్ విజయవంతమయ్యాడు.
కృష్ణజిల్లా నుండి కేరళ వెళ్లిన ఐదుగురు భక్తులు అయ్యప్పస్వామి దేవాలయం ధ్వజస్తంభం పై పాదరసం పోసిన పెద్ద వివాదం సృఫ్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కేరళ పోలీస్ లు వారిని అరెస్టు చేశారు జైౌలు కు పంపారు. కేరళ పోలీసులు విజయవాడ వచ్చి అరెస్టయిన వారి నేపథ్యం ఎమిటో కూడా విచారించారు. అయితే, పెనమలూరు టిడిపి ఎమ్యెల్యే ,బోడె ప్రసాద్ వారిని ఆంధ్రకు వెనక్కు తెచ్చేలా తొలినుంచి కృషి చేస్తూ వస్తున్నారు. మొత్తానికి వారు వెనక్కు వచ్చారు. కేరళ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.దీని వెనక బోడె ప్రసాద్ కృషి చాలా ఉంది.
ఈ సందర్భంగా మాట్లాడు తూ ఇది మాకు మరో జన్మలాంటిదని వారు అన్నారు.బోడె ప్రసాద్ కల్పించుకోక పోతే,మా జీవితం మొత్తం జైల్లో గడిపే వాళ్ళమని వారు వ్యాఖ్యానించారు.సీఎం చందబాబు, లోకేష్ లను కలసి వారి చొరవతో ఆంధ్రా భక్తులు రాష్ట్రానికి వచ్చేలా చేశానని బోడె ప్రసాద్ అన్నారు.‘అస్సలు, ఆంధ్రకి వస్తామనుకోనే లేదు. మాకు బెయిల్ వచ్చేలా చేసిన బోడె ప్రసాద్ కి కృతజ్ఞతలు,’ అని వారు అన్నారు.