పాదయాత్ర భగ్నానికి కుట్ర..?

First Published Nov 30, 2017, 11:06 AM IST
Highlights
  • జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు
  • జగన్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరిస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యే

జగన్ ప్రజా సంకల్ప యాత్రను భగ్నం చేసేందుకు కుట్ర జరుగుతోందా..?  ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బెదిరింపులు కూడా అందులో భాగమేనా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.  జగన్.. నవంబర్ 6వ తేదీ నుంచి ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన నాటినుంచి జగన్ విమర్శలు ఎదుర్కొంటునే ఉన్నారు. జగన్ చేయాల్సింది పాదయాత్ర కాదు.. జైలు యాత్ర అని టీడీపీ నేతలు విమర్శించారు. ఎన్ని విమర్శలు ఎధురౌతున్నా.. ఆయన పాదయాత్ర చేయడం మాత్రం ఆపలేదు. వారం వారం కోర్టుకు వెళ్తుతున్నా.. పాదయాత్ర చేయాలన్న ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడూ వీడలేదు.

తన పార్టీ ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి.. పార్టీనా జగన్  ఏనాడు కుంగిపోలేదన్న మాట వాస్తవం. పాదయాత్ర ప్రారంభించాక కూడా.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడ్డారు. అంతమంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుంటే.. ఏ పార్టీ అధ్యక్షుడైనా కుంగిపోతాడు. కానీ జగన్ మాత్రం.. అలాంటివేమీ తన ముఖంలో కనిపించనివ్వకుండా జనంతో మమేకపోతున్నాడు. టీడీపీ నేతలు ఎంత ప్రయత్నించినా.. జగన్ పాదయాత్రను మాత్రం అడ్డుకోలేకపోయారు. అందుకే మరో అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. అదే ఎస్సీ, ఎస్టీ కేసు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జగన్ పై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ నిజంగా అదే జరిగితే.. జగన్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ప్రభుత్వం కనుక జగన్ ని అరెస్టు చేస్తే.. పాదయాత్రకు బ్రేక్ పడటం విషయం పక్కనపెడితే.. జగన్ మైలేజీ పెరగడం మాత్రం ఖాయం. ఇన్ని రోజులు పాదయాత్ర చేసినా రాని క్రేజ్ ఒక్క అరెస్టుతో వస్తుంది. మరి అలాంటి క్రేజ్ చంద్రబాబు జగన్ కి దక్కనిస్తారా?

 

click me!