అద్దంకిలో ఉద్రిక్తత - భారీగా మోహరించిన పోలీసులు

Published : Jul 08, 2017, 11:24 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
అద్దంకిలో ఉద్రిక్తత - భారీగా మోహరించిన పోలీసులు

సారాంశం

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల మధ్య విభేదాలు జిల్లాలోని అద్దంకిలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల మధ్య విభేదాలు జిల్లాలోని అద్దంకిలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. అద్దంకిలో సీసీ రోడ్డు శంకుస్థాపన సందర్భంగా ఇరు వర్గాల వారూ పోటీపోటీగా శిలా ఫలకాలు ఏర్పాటు చేశారు.

 

ఈ శంకుస్థాపన మరి కొద్ది సేపటిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చేయాల్సి ఉంది.

 

అయితే అంతకంటే ముందే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసేందుకు కరణం వర్గీయులు ఏర్పాట్లు చేసుకుని శిలాఫలకం ఏర్పాటు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !