టిడిపి నాలుకలు ఎన్ని?

Published : Dec 15, 2016, 03:58 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
టిడిపి నాలుకలు ఎన్ని?

సారాంశం

నల్లమల అడవుల నుంచి యురేనియం తవ్వకూడదని తెలంగాణా టిడిపి అంటోంది. మరి ఆంధ్ర టి డిపి ఏమంటోంది?

 

 

తెలుగుదేశం పార్టీ పేరుకే జాతీయ పార్టీ. జాతీయ పార్టీ అధ్యక్షుడనో, జాతీయ ప్రధాన కార్యదర్శి అనో అలంకారం తగిలించుకునేందుకు తప్ప జాతీయ విధానం అమలుచేసేందుకు కాదు. అందుకే,టిడిపికి ఉన్న నాలుకల్లో ఒకటి ఆంధ్రాలో ఒక రకంగా మాట్లాడుతుంది. మరొక నాలుక తెలంగాణాలో ఇంకొక మాట మాట్లాడుతుంది.

 

ఒకే విషయం మీద టిడిపి రెండు విధానాలు పాటించడం చాలా చోట్ల మనకు కనిపిస్తుంది.  

 

ఇపు డు తాజాగా నల్ల మడ అడవుల్లో యురేనియం వెలికి తీయడానికి  తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు వ్యతిరేకత చూపుతున్నారు.  యురేనియం గనులకు, ప్రాసెసింగ్ కు, అణువిద్యుత్కేంద్రాలకు ప్రపంచమంతా వ్యతిరేకత వస్తున్నది. ఈ నేపధ్యంలో అచ్చంపేట ప్రాంత వాసులు నల్ల మడ అడవుల నుంచి తెలంగాణా ప్రభుత్వం యురేనియం తవ్వి తీయడాన్ని వ్యతి రేకించాల్సిందే.

 

అయితే, ఇలా వ్యతిరేకత చూపుతున్న వారు, ఈ విషయాన్ని తమ జాతీయపార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడికి చెప్పి , జాతీయ స్థాయిలో వత్తిడి తీసుకొస్తామని చెబుతున్నారు.  ఎంత అమాయకత్వం.  చంద్రబాబు ఆంధ్రలో చేస్తున్న దేమిటి? ప్రజలు మేధావులు వద్దన్నా శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాడ అణు విద్యుద్కేంద్రం ఏర్పాటుచేస్తున్నారు. మరి ఆయన మీ  డిమాండ్ కు ఎలా మద్ధతిస్తారు?

 

సరే, నాగర్ కర్నూల్ జిల్లా లో నల్లమల సమీప ప్రాంతాలలో టిడిపి నాయకులేమంటున్నారో చూద్దాం.

 

ప్రభుత్వం నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలకోసం డి బీర్ అనేసంస్థకు అనుమతినిచ్చిందని చెబుతే దీనిని అడ్డుకుంటామని టిడిపి అచ్చంపేట  ఇన్ చార్జ్ చారగొండ వెంకటేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ఇక్కడ ప్రశాంతగా జీవిస్తున్న ప్రలజ, చెంచుల ఉనికిని దెబ్బ తీస్తున్నదని  ఆయన అన్నారు.

 

అమరాబాద్, పదర మండలాలో 825 కి.మీ పరిధిని  డి బీర్స్  సంస్థ కుఅప్పగించారని చెబుతూ  తవ్వకాల వల్ల ఈ ప్రాంతంలోని 50 వేల జనాభా ఉనికికి ముప్పు వస్తుందని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లాలో కూడా యురేనియం నిక్షేపాలున్నా, నాగర్ కర్నూల్ నే ఎంచుకోవడం లో అమాయక అదివాసీలుండటమే కారణమని ఆయన ఆరోపించారు.

 

దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి, జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడి తోకలసి పోరాడతామని ఇతర టిడిపి నాయకులుశేఖర్, తిరుపతయ్య గౌడ్, వెంకటేశ్, వెంకటయ్య , సైదులుతో కలసి ప్రకటించారు. ఎలా సాధ్యమో...

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !