అకస్మాత్తుగా నిరాహార దీక్షకు దిగిన సీఎం, డిప్యూటి సీఎం

First Published Apr 3, 2018, 6:37 PM IST
Highlights
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు

 

కావేరి జలాల పంపకాల విషయంలో తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పంపకాల విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ అధికార అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు లోక్ సభా సమావేశాల్లో ఆందోళన చేపడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని భావించిన పార్టీ మరింత ఒత్తిడి పెంచేందుకు ఎత్తుగడ వేసింది. ఇందులో బాగంగా ఇవాళ అకస్మాత్తుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌ సెల్వం నిరాహార దీక్ష దిగారు. 

వెంటనే కావేరీ జలాల మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్నాడీఎంకే పార్టీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా  నిరాహార దీక్షలు చేపట్టాలని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరాహార దీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పాల్గొంటారని తెలిపారు. కానీ అకస్మాత్తుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పళని, ఉప ముఖ్యమంత్రి పన్నీరులే దీక్షకు దిగారు. కావేరీ జలాల విషయంలో అన్నాడీఎంకే కేంద్రంపై తగినంత ఒత్తిడి తీసుకురావడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకే పళని, పన్నీర్‌ ఇద్దరూ దీక్షలో కూర్చున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు దీక్షలో పాల్గొంటున్నాయి. ఈ  దీక్షతో కేంద్రంతో కావేరీ జలాల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయించనున్నట్లు అన్నాడీఎంకే నేతలు తెలిపారు.

click me!