
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లలో డిజిటల్ కాసులు ప్రారంభిస్తున్నది. టెక్నాలజీని ఉపయోగించి విద్యాబోధన నాణ్యతంపెంచడానికి స్కూళ్ల ను డిజిటల్ తరగతులుగా మారుస్తున్నారు. ఈ రోజు సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో ఇలాంటి డిజిటల్ తరగతులను ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్, టీడీపీ నాయకులు కోడెల శివరామ్, ఇతర ఎన్ ఆర్ ఐలు, స్థానిక నాయకులు, అధికారులుపాల్గొన్నారు.