నేను బాగున్నా, రూమర్లు నమ్మవద్దు.. బాలు

Published : Sep 07, 2017, 03:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
నేను బాగున్నా, రూమర్లు నమ్మవద్దు.. బాలు

సారాంశం

తాను ఆరోగ్యంగానే ఉన్నానన్న ఎస్పీ బాలు సోషల్ మీడియాలో రూమర్లను ఖండించిన బాలు

తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్లు నమ్మవద్దని ప్రముఖ సినీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం సరిగా లేదంటూ సోషల్ మీడియాలో రూమర్లు.. చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఆయన  తాజాగా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండిస్తూ ఫేస్ బుక్ లో ఒక విడియోని కూడా పోస్టు చేశారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానంటూ ఆయన స్వయంగా మాట్లాడిన వీడియో పోస్టు చేశారు.

 

మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ తెలిసిన వాళ్లు యోగక్షేమాలు అడుగుతుంటే షాక్ అయ్యానని చెప్పారు. ఇలాంటి రూమర్లు సోషల్ మీడియాలో ఎందుకు పుట్టిస్తారో అర్థంకావడం లేదని బాలు వాపోయారు. ఆరోగ్యం బాగోకపోవడం వల్లే తాను ప్రదర్శనలు రద్దు చేసుకుంటున్నానని పలువురు అంటున్నారని బాలు చెప్పారు. జలుబు, దగ్గు లాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పుడ డాక్టర్ దగ్గరకు వెళ్లినంత మాత్రనా ఆరోగ్యంగా లేనట్టేనా అని ప్రశ్నించారు. తాను ప్రదర్శనలు రద్దు చేసుకోవడం వెనక వేరే కారణం ఉందని ఆయన చెప్పారు.

 

 

ఆగస్టు 23న తన సోదరి గిరిజ ఆకస్మికంగా కన్ను మూసారని..అక్కడే 10 రోజులు దాకా ఉన్నానని చెప్పారు. తర్వాత సెప్టెంబర్ 2వ తేదీ బెంగళూరులో ప్రదర్శన కూడా ఇచ్చినట్లు చెప్పారు. అనవసరం రూమర్లు క్రియేట్ చేసి బాధపెట్టవద్దని ఆయన కోరారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !