హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో అరుగురు దహనం

First Published Feb 22, 2017, 7:49 AM IST
Highlights

రాజేంద్ర నగర్  ఎయిర్ కూలర్ తయారీ యూనిట్ ల ో ప్రమాదం

హైదరాబాద్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అరుగురు వ్యక్తులు కాలిపోయారు. బుధవారంనాడు  ఈప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ లో ఎయిర్ కూలర్స్ మరియు  బ్యాటరీ లతో నడిచేవాహనాలను తయారుచేసే యూనిట్ ఈ ప్రమాదం జరిగింది. కాలిపోయిన అరుగురిలో నలుగురు యూనిట్ లో పనిచేసిన కార్మికులని తెలిసింది. మిగతా ఇద్దరు వారికోసం వచ్చిన మిత్రులని చెబుతున్నారు. ఈ ప్రమాదం తెల్లవారు జామున నాలుగు గంటలపుడు జరిగింది.యూనిట్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

కార్మికులు ఒక విద్యుత్ పరికరాన్ని తయారుచేస్తున్నపుడు ఈ ప్ర మాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

 

‘ అయితే ప్రమాదం జరిగిందో తెలియడంలేదు. నలుగురు మృతదేహాలు తలుపు దగ్గర పడ్డాయి. మిగతా రెండు హాల్లో ఉన్నాయి,’అని పోలీసులు తెలిపారు.

 

రాత్రి వెళ్లిపోయేటపుడు కార్మికులను లోపలే ఉంచి బయటనుంచి యూనిట్ కు తాళం వేసి యజమాని వెళ్లిపోయాడని సమాచారం.

 

అగ్నిప్రమాద స్థలాన్ని శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రి మహేందర్‌రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నియమాలు పాటించని గోదాంలపై చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. కార్మికశాఖ తరపున ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల నష్టపరిహారం అందిస్తామని వారు తెలిపారు.

 

ఇలాగే ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేలు తక్షణ సాయం అందేలా చూస్తామని కూడా ఆయన చెప్పారు.

 

click me!