సీఎంపై చెప్పులతో దాడి(వీడియో)

Published : Feb 21, 2018, 11:53 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
సీఎంపై చెప్పులతో దాడి(వీడియో)

సారాంశం

బహిరంగసభలో మాట్లాడుతున్న సీఎం చెప్పులు విసిరిన బీజేపీ కార్యకర్త

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పై చెప్పులతో దాడి చేశారు. మరికొద్ది రోజుల్లో బేజీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం బార్ ఘర్ ప్రాంతంలో పర్యటించారు.  అనంతరం కుంభారీ గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై చెప్పులు విసిరాడు. చెప్పుల దాడి నుంచి సీఎం తప్పించుకున్నారు. అప్రమత్తమైన ఇతర నేతలు, కార్యకర్తలు.. చెప్పులతో దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. ఈ దాడి చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !