అనుకున్నది సాధించిన శ్రీరెడ్డి

First Published Apr 13, 2018, 10:07 AM IST
Highlights
శ్రీరెడ్డి విషయంలో వెనక్కి తగ్గిన ‘మా’

యాంకర్, సినీ నటి శ్రీరెడ్డి తాను అనుకున్నది సాధించారు. ఎట్టకేలకు శ్రీరెడ్డి విషయంలో ‘మా’ కాస్త వెనక్కి తగ్గింది. శ్రీరెడ్డితో కలిసి మాలోని సభ్యులు ఎవరైనా నటించవచ్చని  చెప్పారు. ఆమెతో కలిసి నటిస్తే సభ్యత్వం తొలగిస్తామన్న ఇదివరకటి  నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంటున్నట్టు ఆయన తెలిపారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల్ని అడ్డుకునేందుకు కమిటీ ఎగెనెస్ట్‌ సెక్సువల్‌  హెరాస్‌మెంట్‌ (క్యాష్‌) పేరుతో బయటి వాళ్లతోనూ, చిత్ర పరిశ్రమ  వ్యక్తులతోనూ కలిపి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.    గురువారం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో విలేకర్ల సమావేశం జరిగింది.


ఈ సమావేశంలో మా అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ...‘‘ఎవరికైనా అవకాశాలు దర్శకనిర్మాతలే ఇవ్వాలి. కానీ కొంతమంది సభ్యులకి అవకాశాలు ఇప్పించేందుకు ‘మా’ ప్రయత్నం చేస్తుంటుంది. ఆ మధ్య తేజగారికి ఫోన్‌ చేసి అడిగితే ఆయన శ్రీరెడ్డికి అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మేం ఎవ్వరిమీద పగ సాధించాలనుకోవడం లేదు. శ్రీరెడ్డి విషయంలో ఆ రోజు చలన చిత్ర వాణిజ్య మండలి ఆవరణలో జరిగిన సంఘటనపై మనస్తాపం చెంది ‘మా’ సభ్యులెవరూ ఆమెతో కలిసి నటించకూడదని నిర్ణయించాం. కానీ మళ్లీ పరిశ్రమ పెద్దలు, సభ్యులు ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని అడిగారు. అందుకే మాలో ఉన్న 900మంది సభ్యులూ శ్రీరెడ్డితో కలిసి నటించొచ్చనే నిర్ణయం తీసుకొన్నాం. దాంతోపాటు శ్రీరెడ్డి ఏ సహాయం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ‘మా’ సభ్యత్వం అనేది మాత్రం కమిటీ నిర్ణయించాల్సిన విషయం’’ అన్నారు. పరిశ్రమలో అమ్మాయిలపై జరుగుతున్న వేధింపుల విషయం గురించి ఆయన మాట్లాడుతూ ‘‘ఇకపై పరిశ్రమలో ఓ కమిటీ పనిచేస్తుంది. ఆ కమిటీనే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది’’ అన్నారు

click me!