చిన్నమ్మ  జైల్ మేట్ ఎవరో తెలుసా...?

First Published 16, Feb 2017, 11:03 AM IST
Highlights

పరప్పర అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఇకపై రోజూ ఓ సీరియల్ కిల్లర్ తో సహవాసం చేయాల్సి ఉంటుంది.

అమ్మ స్థానంలో తమిళనాడు సీఎం అవ్వాలనుకున్న చిన్నమ్న కల చెదిరిపోయింది. సీఎం సీటులో కూర్చోవాల్సిన సమయంలో జైళ్లో నేల మీద కూర్చొనే పరిస్థితి వచ్చింది.

 

ముఖ్యమంత్రిగా అధికారగణం మధ్య రాజభోగాలు అనుభవించాల్సిన తరుణంలో ఖైదీల మధ్య దోషిగా కాలం గడిపే పరిస్థితి దాపురించింది.

 

అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు శశికళకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో నిన్ననే ఆమె కర్ణాటకలోని పరప్పర అగ్రహార జైలుకు వెళ్లిపోయారు.

 

అయితే అక్కడ ఖైదీ నెంబర్ 9235 గా ఓ సీరియల్ కిల్లర్ తో ఆమె ఉండాల్సి వస్తుందట. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరూ తెలుసా.. 12 మంది మహిళలను కిరాతకంగా చంపిన కేడీ కెంపన్న. అలియాస్ సైనేడ్ మల్లిక. ఆమె కూడా ఇదే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈమె దేశంలోనే మొదటి మహిళా సీరియల్ కిల్లర్. 

 

ఇప్పుడు శశికళ తో పాటు ఆమె బంధువు ఇళవరసి ఒకే బ్యారక్ లో ఉంటుండగా ఆమెకు సమీపంలో ఈ సైనేడ్ మల్లిక బ్యారక్ ఉంటుందట.

 

కాగా, జైలు నిబంధనల ప్రకారం శశికళ తో పాటు ఇళవరసికి అక్కడి అధికారులు మూడు జతల చీరెలు ఇచ్చారట. ఇకపై చిన్నమ్న జైల్లో కేండల్ తయారు చేయాల్సి ఉంటుందని జైలు అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Last Updated 26, Mar 2018, 12:03 AM IST