తాజ్ మహల్ మాయని మచ్చా?

First Published Oct 16, 2017, 3:33 PM IST
Highlights
  • వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన బీజేపీ ఎమ్మెల్యే
  • తాజ్ మహల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సంగీత్ సోము

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్.. దేశానికి మాయని మచ్చ అంటూ బీజేపీ నేత, ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ కట్టించిన వ్యక్తి.. తన తండ్రినే జైలులో పెట్టించాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే.. యూపీలో భాజపా ఆరు నెలల పాలన ముగిసిన సందర్భంగా ఇటీవల పర్యాటక ప్రాంతాలతో ఓ బుక్‌లెట్‌ విడుదల చేశారు. అయితే అందులో తాజ్‌మహల్‌ పేరు లేకపోవడంతో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఈ విధంగా స్పందించారు. ‘తాజ్ మహల్ ని జాబితాలో చేర్చలేదని చాలా మంది విమర్శిస్తున్నారు.. అసలు తాజ్ మహల్ ది ఒక చరిత్రేనా? హిందువులను యూపీ నుంచి తరిమికొట్టాలనుకున్నారు అదీ  ఓ చరిత్రేనా?’ అంటూ ప్రశ్నించారు.

షాజహాన్.. హిందువులను లేకుండా చేయాలనుకున్నాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతేకాదు.. అక్బర్, బాబర్ లను దేశ ద్రోహులుగా వర్ణించారు. అక్బర్, బాబర్ ల చరిత్రలను పస్తకాల నుంచి తొలగిస్తామని’ చెప్పారు.

గొప్ప గొప్ప హిందూ రాజులు చాలా మంది ఉన్నారని.. వారి జీవిత కథలను తమ బీజేపీ ప్రభుత్వం పుస్తకాల్లో చేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. మహారాణా ప్రతాప్, శివాజీ వంటి రాజుల గురించి పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

నిజానికి తాజ్ మహల్ ని తన భార్య గుర్తుగా కట్టించిన షాజహాన్ ని.. అధికారం కోసం సొంత కుమారుడు ఔరంగజేబే  జైలో పెట్టాడు. ఇది అసలు చరిత్ర అయితే..దీనిని ఎమ్మెల్యే సోము..వక్రీకరించి షాజహాన్ తన తండ్రిని జైలులో పెట్టాడని మాట్లాడుతున్నారు.

ఎమ్మెల్యే సోము.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో దాద్రి ఘటనమీద, ముజఫర్ నగర్ అల్లర్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు.

click me!