శాంసంగ్ ఆ మోడల్ ఫోన్లపై భారీ తగ్గింపు

Published : Mar 06, 2018, 03:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
శాంసంగ్ ఆ మోడల్ ఫోన్లపై భారీ తగ్గింపు

సారాంశం

ధర తగ్గిన శాంసంగ్ జే7 ప్రో, జే7 మ్యాక్స్

ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్ ఫోన్ల ధరలు తగ్గాయి. శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రొ, గెలాక్సీ జే7 మ్యాక్స్‌ ధరలను భారత్‌లో తగ్గించింది. ఈ తగ్గింపుతో గెలాక్సీ జే7 ప్రొ ధర రూ.18,900 కి, గెలాక్సీ జే7 మ్యాక్స్‌ ధర రూ.14,900కు చేరింది.  ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లను గతేడాది శాంసంగ్‌ భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది.

తొలుత విడుదల చేసిన సమయంలో గెలాక్సీ జే7 ప్రొ ధర.రూ. 20,900 గా ఉండగా.. గెలాక్సీ జే7 మ్యాక్స్‌ ధర రూ. 17,900గా ఉంది. కాగా.. ఇప్పుడు జే ప్రొ మీద రెండు వేలు, జే7 మ్యాక్స్ మీద మూడువేల రూపాయిలు తగ్గించారు. శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌, ఈ-కామర్స్‌ సైట్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లలో తగ్గించిన ధరలు అందుబాటులోకి వచ్చాయి. ఆఫ్‌లైన్‌ రిటైలర్ల వద్ద కూడా ధరలు తగ్గినట్టు ముంబైకి చెందిన మహేశ్‌ టెలికాం ధృవీకరించింది.

ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లు స్లిమ్‌ మెటల్‌ యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. హోమ్‌ బటన్‌ వద్ద ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది. గోల్డ్‌, బ్లాక్‌ రంగుల్లో ఇవి మార్కెట్లోకి వచ్చాయి. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !