ఫ్లిప్ కార్డ్ సహ వ్యవస్థాపకుడు సచిన్ ఉద్వేగభరితమైన పోస్ట్

First Published May 10, 2018, 2:59 PM IST
Highlights

పదేళ్లు గడిచాయి, ఇంతటితో ఫ్లిప్ కార్డులో నా పనిపూర్తయింది అని ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ అన్నారు.

బెంగళూరు: పదేళ్లు గడిచాయి, ఇంతటితో ఫ్లిప్ కార్డులో నా పనిపూర్తయింది అని ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ అన్నారు. వాల్ మార్ట్ కు 77 శాతం వాటాలను విక్రయిస్తూ ఒప్పందం జరిగిన తర్వాత ఆయన ఫేస్ బుక్ లో ఉద్వేగపూరితమైన పోస్టు పెట్టారు. 

ఇక తాను తన వ్యక్తిగతమైన ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టేందుకు సమయం చిక్కిందని, ఈ రోజుల్లో చిన్న పిల్లలు ఆడుకునే ఆటలపై దృష్టి పెడుతానని, తన కోడింగ్ నైపుణ్యాలకు పని చెబుతానని అన్ారు. ఫ్లిప్ కార్ట్ తో తన బంధం, అనుభవం అపూర్వమైందని అని అన్నారు.

ఫ్లిప్ కార్ట్ ఎంతో సాహసవంతమైన సంస్థ ్ని, కస్టమర్ల సౌలభ్యమే లక్ష్యంగా పనిచేస్తుందని, ఇక్కడ పలువురు మంచి వ్యక్తులతో పనిచేసే అవకాశం దొరికిందని, చాలా పెద్ద సవాళ్లను కూడా ఎదుర్కున్నామని అన్నారు. దేశంలో ఎన్ని సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించామని అన్నారు.

ఆ రకంగా పదేళ్లు గడిచిపోయాయని, అయితే బాధాకరమైన విషయమేమిటంటే ఇంతటితో ఫ్లిప్ కార్ట్ లో తన పని పూర్తయిందని, ఇక తన పనులన్నీ అప్పగించి ఫ్లిప్ కార్ట్ ను వదిలే సమయం వచ్చిందని అన్నారు. 

click me!