రాయలసీమ రైతులారా ఆత్మహత్యలొద్దు, పోరాడదాం

First Published Sep 10, 2017, 9:35 PM IST
Highlights

బతుకు పై పోరాటం చేయ్యాల. అంతేగాని, పిరికి నాకొడుకుల్లాగా చావడం ఏందో నాకు అర్థం కాదు నాయనా

 

తిప్పయ్య రైతు. ఆరెకరాల ఆసామి, తినెందుకు తిండిలేదు. బతుకుదెరువు కోసం అనంతపురం రైతు బజార్లోఏదో పనిచేసుకుని బతుతుకున్నాడు.

ఈ రోజు ఆత్మహత్యలు వద్దని అవగాన కల్పించేందుకు రైతుబజారుకు వచ్చిన బృందానికి తిప్పయ్య కనిపించారు. తిప్పయ్య ప్రదర్శించిన  ఆత్మస్థయిర్యం గుండెనిబ్బరం,బతుకు మీద విశ్వాసం అరుదయిన అనుభవం.

 ‘‘ఏమన్నా పొలం బాగుందా?’’ అని తిప్పయ్యను అడిగారు

 ‘‘ ఏం బాగాలే నాయనా. నాకు 6 ఎకరాలు పొలం ఉంది. మూడేండ్ల పొద్దయింది సరయిన పంట లేదు. ఇదిగో  ఈ రైతు బజార్ లొనే పని చేసుకుంటా బతుకుతండా,’ అని గుండెనో కోసే సమాధానం ఇచ్చాడు.

ఏమన్నా మీఊరిలో ఆత్మహత్య లు జరిగాయా ఎప్పుడయినా?

ఆయన పిరికి వాడు కాదు.మనిషి నిలువెత్తు ఆత్మస్తయిర్యం. ఆయన సమాధానంఇలా ఉంది.

‘‘ఒకప్పుడు జరిగినాయి నాయనా... కానీ బతుకు పై పోరాటం చేయ్యాల. అంతేగాని, పిరికి నాకొడుకుల్లాగా చావడం ఏందో నాకు అర్థం కాదు నాయనా,’  అని అందరూ అవాక్క య్యేలా చేశాడు. ఆయన్ను దారిద్య్రం లొంగదీసుకోలేకపోయింది. అందుకే కష్టాలలో అంత నిబ్బరంగా ఉంటున్నాడు. సాధారణంగా ఇది చాలా కష్టం. రైతులంతా అలా ఉండాలి. మంచిరోజు కోసం కలలు కనాలి, మంచిరోజులు తెచ్చుకునేందుకు ముందుకు పోవాలి.

‘ఎదయితేనేం  మా వాళ్ళ గుండె ధైర్యం చూడండి కరువుతో విలవిలలాడినా భయపడటం లేదు,’అన్నాడు.

కొంత మంది అమాయకులు అవగాహన కల్పించడం మా బాధ్యత కాబట్టి ఇలా వచ్చాం, అని ఈ బృందం చెప్పింది.

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని ఈరోజు రైతుల సమక్షం లో స్థానిక మార్కెట్ యార్డ్ లో రాయలసీమ విమోచన సమితి(ఆర్ విఎస్) ఆద్వర్యం లో పై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసి పాటించడం జరిగింది. ఆర్ విఎస్ జిల్లా కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రైతులు పూర్తిగా నిరాశ నిస్పృహలున్నా, రైతాంగం పంటలు పండకున్నా,  ధైర్యంగా ముందుకు సాగల అన్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడతామని అన్నారు. రైతులెవ్వరు ఆత్మహత్య చేసుకోకూడదని మాట తీసుకోవడం జరిగింది. మురళి కృష్ణ మాట్లాడుతూ దేశంలో  ముఖ్యంగా రాయలసీమలో ఆత్మహత్యలు ఇకపై జరగకూడదని ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ  కార్యక్రమంలో ఆర్ వి ఎస్ నాయకులూ రాజ శేఖర్ రెడ్డి,మురళి కృష్ణ,కేదార్ నాథ్,రైతులు నాగయ్య,రాముడు,యల్లప్ప,పెద్దన్న పాల్గొన్నారు.

ఇండియన్ కౌన్సిల్ ఫర్  అగ్రికల్చర్ రీసెర్చ్ మాజీ సభ్యుడు ఎంవిఎస్ నాగిరెడ్డి  చెప్పినట్లు కేవలం అనంతపూర్ జిల్లాలో 5 లక్షల మంది ఇతర రాష్ట్రాలతో పనులు చేసుకుంటూ బతుకెళ్లదీస్తున్నారు.  ఎంత దుర్భర పరిస్థితులు జిల్లాలో ఉన్నాయోచూడండి. అనంతపురం జిల్లాలో 63 మండలలున్నాయి గడిచిన 3 సంవత్సరాలు 63 జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించిందంటే మీరే అర్థం చేసుకోండి.

నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో 2014 లో  160 రైతుల ఆత్మహత్యలు జరుగగా 2015 లో 516 రైతుల ఆత్మహత్యలు జరిగాయి... అనగా 2014 తో పోల్చుకుంటే 2015 లో 322% శాతం పెరిగినాయి.భారత దేశం మొత్తం మీద 1995 నుండి 2015 వరకు ఏటా సగటున 15000 రైతుల ఆత్మహత్యలు జరిగినాయి.నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం భారత దేశం మొత్తం మీద 1995 నుండి 2015 వరకు ఏటా సగటున 15000 రైతుల ఆత్మహత్యలు జరిగినాయి కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో 2014 లో  160 రైతుల ఆత్మహత్యలు జరుగగా 2015 లో 516 రైతుల ఆత్మహత్యలు జరిగాయి... అనగా 2014 తో పోల్చుకుంటే 2015 లో 322% శాతం పెరిగినాయి.నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం కేవలం రైతుల రుణాల కారణంగా 56% మరణాలు సంభవిస్తాండాయి...

వర్షాలు రాక పంటలు పండకపోవడంతోనో లేక పంటలకు సంబంధించి ఇతర సమస్యల వల్లనో అంటే పంటకు గిట్టుబాటు ధరలు లేక మరి ఇతర కారణాల వల్ల 27% మరణాలు సంభవిస్తాండాయి.ప్రభుత్వాన్ని ఈ విషయం మీద అడిగితే రైతు మరణాలు లేకుండా చేయడమే మా ద్యేయం అన్నారు... ప్రభుత్వానికి శిరస్సు  వంచి మొక్కుతాం నిజంగా రైతు హత్యలు చేసుకోకుండా పరిపాలిస్తే..కానీ జరుగుతున్నదేంటి 2014 కంటే 2015 లో 322% ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు పెరగడమా???

రైతు  ఆత్మహత్యలకు ప్రధాన కారణమయిన రైతు రుణమాఫీ అంశంలో విడతలు పాటించినందు వల్ల ఆశించిన ఫలితం ఉందా ఏలిన వారు ఆలోచించాలి.

click me!