
డ్రగ్స్ మాఫియా కేసును డీల్ చేస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మేంట్ డీఐజీ అకున్ సబర్వాల్ అని తెలిసిందే. అయితే హైదదాబాద్ లో డ్రగ్స్ ను ఒక ఆటాడిస్తున్న ఆయనను మీడియా మరీ ఆకాశానికి ఎత్తుతుందని వాక్యానించారు డైరెక్టర్ ఆర్జీవీ. సిట్ దర్యాప్తు అంశంలో సోషల్ మీడియా ఫేస్‌బుక్ లో ఆర్జీవీ స్పందించారు.
స్కూల్ పిల్లలు డ్రగ్స్ వాడటం కాస్తా కంగారు పెట్టిందని. ఒకింత ఆశ్చర్యానికి గురైయానని అన్నారు. అయితే డ్రగ్ విషయంలో తెలుగు మీడియా మరి అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆయన సెటైర్లు విసిరారు. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న అకున్ సబర్వాల్ ను మీడియా ఏకంగా అమరేంద్ర బాహుబలితో పోల్చుతున్నారని అన్నారు. అకున్ చేస్తున్న పనికి మీడియా తీరు చూస్తుంటే రమమౌళీ బాహుబలి - 3 తీస్తారేమో అన్నట్లు ఉందని కాస్తా అసహానం వ్యక్తం చేశారు.
ఆర్జీవీ మీడియా పోకస్ ను తప్పుపట్టారు. డ్రగ్స్ సినీ పరిశ్రమలోనే కాదు చాలా రంగాలలో ఉంది. కానీ సినిమా రంగాన్ని మాత్రమే ఫోకస్ చేస్తున్నారని అసహానం వ్యక్తం చేశారు. మీడియా దేశంలో ప్రజలను పీడిస్తున్న చాలా సమస్యలు ఉన్నాయని వాటి మీద దృష్టి సారించాలని సూచించారు.