జియో కష్టమర్లకు శుభవార్త

First Published Mar 22, 2018, 5:02 PM IST
Highlights
  • త్వరలో జియో ఫోన్ లో వాట్సాప్
  • ప్రకటించిన జియో

ప్రముఖ టెలికాం సంస్థ జియో కష్టమర్లకు కంపెనీ అతి పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. అతి తక్కువ ధరకే జియో వినియోగదారులకు ఫీచర్ ఫోన్ లను అందజేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఫోన్లను దేశవ్యాప్తంగా లక్షల మంది కొనుగోలు చేశారు. అది ఫీచర్ ఫోన్ కావడంతో ఇప్పటి వరకు అందులో వాట్సాప్ వినియోగించడానికి లేదు. కాగా.. ఇప్పుడు ఈ ఫోన్ లోనూ వాట్సాప్ వస్తోంది.

ఈ విష‌య‌మై ఇప్ప‌టికే ఆ ఫోన్ల‌కు వాట్సాప్ నూత‌న యాప్‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిసింది. జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ల‌లో కాయ్ ఓఎస్ (KaiOS) ఉంటుద‌న్న విష‌యం తెలిసిందే. దీంతో ఈ ఓఎస్‌లో న‌డిచే కొత్త వాట్సాప్ వెర్ష‌న్ యాప్‌ను ప్ర‌స్తుతం వాట్సాప్ డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో త్వ‌ర‌లో జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌లో కూడా వాట్సాప్ ప‌నిచేయ‌నుంది. అయితే ఈ యాప్‌ను ఎప్పుడు విడుద‌ల చేసేది వాట్సాప్ చెప్ప‌లేదు. కానీ అతి త్వ‌ర‌లోనే జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌లో నడిచే కొత్త వాట్సాప్ వెర్ష‌న్ యాప్ మాత్రం ఆ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌స్తుంది. ఇప్ప‌టికే గూగుల్‌, ఫేస్‌బుక్ యాప్‌లు ఈ ఫోన్లలో ల‌భిస్తుండ‌గా, ఇక‌పై వాట్సాప్ కూడా వీటిలో ల‌భ్యం కానుంది.

click me!