కర్నూలులో అశ్లీల నృత్యాలు.. తెర వెనుక సీఐ

Published : Feb 20, 2018, 12:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కర్నూలులో అశ్లీల నృత్యాలు.. తెర వెనుక సీఐ

సారాంశం

కర్నూలులో రేవ్ పార్టీ కలకలం ముగ్గురు యువతులతో అశ్లీల నృత్యాలు

కర్నూలు జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్‌ పార్టీ కలకలం సృష్టించింది. నగరంలోని ఒక ప్రదేశంలో ఒక  ఎరువుల కంపెనీ నిర్వాహకులు తమ డీలర్లకు విందును ఏర్పాటు చేసి ముగ్గురు యువతులతో ఆశ్లీల నృత్యాలు చేయించారు. ఈ పార్టీలో గతంలో నగరంలోని వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో పని చేసిన సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారులు ఉన్నట్లు సమాచారం. 

   
పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ అపార్ట్‌ మెంట్‌లో ఓ ఎరువుల కంపెనీ తమ డీలర్లకు విందు పార్టీని ఏర్పాటు చేసింది. ఇందులో నృత్యాలు చేయడానికి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన పార్టీ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. రాత్రి 9 గంటల నుంచి యువతులు ఆశ్లీలంగా నృత్యాలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దాదాపు 25 మంది పీకలదాకా మద్యం సేవించి .. ఆ యువతులతో చిందులు వేశారు. కాగా... ఈ రేవ్ పార్టీ గురించి షీటీమ్ కి సమాచారం అందింది.

వెంటనే షీ టీం రాత్రి 11 గంటల ప్రాంతంలో దాడి చేయగా.. సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారుల గుట్టు రట్టయింది. పోలీసులను చూడగానే ఆ సీఐ షీటీంపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అనంతరం సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారులు అక్కడి నుంచి పరారయ్యారు. పార్టీలో నృత్యాలు చేసిన ముగ్గురు యువతులు, మరో 9మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu