తలదగ్గర ఫోన్ పెట్టుకొని పడుకుంటున్నారా..?

First Published Dec 18, 2017, 12:37 PM IST
Highlights
  • సెల్ ఫోన్ కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశం
  • పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయంటున్న నిపుణులు

మీరు ప్రతిక్షణం.. మీ సెల్ ఫోన్ ని మీవెంటే ఉంచుకుంటారా? కాసేపు కూడా ఫోన్ వదిలిపెట్టి ఉండలేరా? రాత్రి పడుకునేటప్పుడు కూడా ఫోన్ ని మీకు దగ్గరా పెట్టుకుంటున్నారా..? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. పైన చెప్పినవన్నీ మీరు చేస్తున్నట్లయితే.. త్వరలో మీరు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటున్నారు నిపుణులు.

ప్రస్తుతకాలంలో..సెల్ ఫోన్స్ ఒక భాగమైపోయాయి. ఎంతలా అంటే టాయ్ లెట్ లేని ఇళ్లు అయినా ఉంటుందేమోగానీ.. సెల్ ఫోన్ లేని ఇళ్లు మాత్రం ఎక్కడా కనపడటం లేదు. సెల్‌ వాడకం ద్వారా ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీటి నుంచి ప్రసారమయ్యే సూక్ష్మతరంగాలు క్యాన్సర్ కలగచేస్తాయని అనేక అధ్యాయనాలు స్పష్టం చేస్తున్నాయి.

కాలిఫోర్నియాకు చెందిన నిపుణుల పరిశోధన ప్రకారం..సెల్ ఫోన్ లోని రేడియో ధార్మిక కణాలు.. మానవశరీరంపై ప్రభావం చూపి.. క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి. మరి దీనికి పరిష్కారమే లేదా? అంటే.. కొన్ని రకాల సూచనలు పాటిస్తే.. కొంత మేర ఈ క్యాన్సర్ నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం..

సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఏదైనా సరే.. మరీ దగ్గరపెట్టి చూడకూడదు. కాబట్టి.. కొంత దూరంలో పెట్టి చూస్తే సరిపోతుంది. అంతేకాకుండా.. సెల్ ఫోన్ ఎప్పుడూ ఫ్రంట్ పాకెట్ లో పెట్టుకోకూడదు. కేవలం బ్యాక్ పాకెట్ లోనూ, లేదా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. చాలా మందికి.. సెల్ ఫోన్ లో అలారమ్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. మరి అలాంటివాళ్లు ఏమి చెయ్యాలో తెలుసా? ఫోన్ ని ఆఫ్ చేయాలి లేదా.. ఎయిరోప్లేన్ మోడ్ లో పెట్టుకొని బెడ్ కి కొంత దూరంలోపెట్టుకోవాలి. ముఖ్యంగా పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వకూడదు. పెద్దవారిలో కంటే పిల్లల్లో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు వారిని ఫోన్లకు దూరంగా ఉంచడం మంచిది.

click me!