ఆ విషయంలో ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన పుజారా

Published : Mar 19, 2017, 10:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఆ విషయంలో ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన పుజారా

సారాంశం

ఆస్ట్రేలియాతో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన పుజారా

క్రికెట్ లో ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాహుల్ ద్రవిడ్ 13 ఏళ్ల రికార్డును చటేశ్వర పుజారా బద్దలు కొట్టారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో పుజారా ఈ ఘనత సాధించాడు.

 

2004 లో రాహుల్ ద్రవిడ్ ఒక టెస్టు ఒకే ఇన్నింగ్స్ లో 495 బాల్స్ ఆడి 270 పరుగులు చేశాడు. గత 13 ఏళ్లుగా అత్యధిక బంతులు ఆడిన భారత్ బ్యాట్స్ మెన్ గా ద్రవిడ్ పేరు మీదనే ఈ రికార్డు కొనసాగుతోంది.

 

అయితే ఆస్ట్రేలియా టెస్టులో పుజారా ఈ రికార్డును అధిగమించాడు. నాలుగో రోజు ఆటలో పుజారా మొత్తంగా ఒకే ఇన్నింగ్స్ లో 524  బాల్స్ ఆడి 202 పరుగులు చేశాడు. దీంతో భారత్ తరఫున ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక బాల్స్ ఆడిన రికార్డు పుజారా పేరుతో నమోదైంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !