మంద కృష్ణను పట్టుకునేందుకు ఆంధ్రా పోలీసుల గాలింపు

First Published Jul 8, 2017, 6:06 PM IST
Highlights

ఏ క్షణానైనఎమ్మార్పీఎస్  వ్యవస్థాపక అద్యక్షులు మందా కృష్ణమాదిగ ను అరెస్టు చేసేందుకు ఆంధ్రా పోలీసుల యత్నం. ఆయన కోసం గాలిస్తూ రాజధాని సమీపంలో ఇబ్రహీంపట్నం మండలం దొనబండ వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ మొదలుపెట్టారు.

ఏ క్షణానైనఎమ్మార్పీఎస్  వ్యవస్థాపక అద్యక్షులు మందా కృష్ణమాదిగ ను అరెస్టు చేసేందుకు ఆంధ్రా పోలీసుల యత్నం. ఆయన కోసం గాలిస్తూ రాజధాని సమీపంలో ఇబ్రహీంపట్నం మండలం దొనబండ వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ మొదలుపెట్టారు.

 

నిన్న జరగాల్సిన ఎమ్మార్పీఎస్ కురుక్షేత్ర మహాసభను అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.  సభకు వస్తున్న వేలాది మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. అయితే, ఏదో విధంగా గ గుంటూరు వచ్చి వందలాది మంది కార్యకర్తులు నిరసన తెలిపారు. పోలీసులు కన్నుగప్పి ఎమ్మార్పీఎస్ బీభత్సం సృష్టించడం మీద ఈ రోజు ముఖ్యమంత్రి పోలీసుల వైఫల్యాన్ని సమీక్షిస్తూ  అగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనితో  ఈ రోజు  పోలీసుల మంద కృష్ణను అరెస్టు చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు.రెండు బస్సులను, ఒక పోలీసు వ్యాన్ ను నిన్న తగల బెట్టడానికి సంబంధించి 12 కేసులు పెట్టారు.


ఈ కేసులలో ఏ1గా మందకృష్ణ ను చేర్చినట్లు  డీజీపీ సాంబశివరావు ఈరోజు విజయవాడలో  తెలిపారు. అన్ని కేసుల్లో మందకృష్ణను అరెస్ట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కురుక్షేత్రం సభకు అనుమతి లేకపోయినా తప్పుడు ప్రచారం చేసి జనాన్ని సమీకరించారని డీజీపీ తెలిపారు. ఇలాంటి ఉద్యమాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్‌ పాడవుతుందని విద్యార్థులకు డీపీజీ సాంబశివరావు తెలిపారు.
 

 

 

 

click me!