పవన్ కల్యాణ్ ని ఇరుకున పెట్టిన ప్రశ్న...

First Published Dec 6, 2017, 11:42 AM IST
Highlights

తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో, బిజెపి ప్రభుత్వం ఢిల్లీలో చేస్తున్న తప్పిదాలకు నేను బాధ్యుడినే...

ఒక రాజకీయ  ప్రశ్న  పవన్ కల్యాణ్ ని బాగా ఇరుకున పెట్టింది. ఆ ప్రశ్న ఆయన భవిష్యత్ రాజకీయ పంధాని నిర్దేశించనుంది.పవన్ కల్యాణ్ మళ్లీ తెలుగుదేశం తో వెళతాడని   కొంతమంది ఎప్పటినుంచో  కథనాలు ప్రారంభించారు. అయితే, ఆయన రాజకీయ పంధా ఎలా ఉంటుందో ఆయన అపుడపుడు సంజ్ఞా మాత్రంగా చెబుతూనే ఉన్నారు. ఇపుడు తనకు ఎదురయిన చిక్కు ప్రశ్కను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ తన దారి ఎటో మరొకసారి  వివరించారు. అదేమిటో చూద్దాం.

ఈ మధ్య జనసేనాని పవన్ కల్యాణ్  లండన్ పర్యటన వెళ్లారు. అక్కడ ఆయన  తెలుగు విద్యార్థులతో చాలా సేపు మాట్లాడారు. అయితే, అందులో ఒక విద్యార్థి వేసిన ప్రశ్న ఆయనను బాగా ఇరుకును పెట్టింది. ఆలోచింప చేసింది.

 ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు.

ఆ మధ్య ఇంగ్లాండ్‌ పర్యటనలోఉన్నపుడు విద్యార్థులతో జరిగిన ఒక  సమావేశంలో  ఒక తెలుగు విద్యార్థి వేసిన  ప్రశ్న నన్ను అంతర్మథనంలో పడేసింది. ఆ ప్రశ్న ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదం విషాద సంఘటన గురించినది.  ఆ విద్యార్థి ఈ దుర్ఘటన ప్రస్తావిస్తూ,  ''రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పడవ ప్రమాదం జరిగిందనేది స్పష్టం. ఇందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రభుత్వానిదే బాధ్యత.  ప్రభుత్వం తెలుగుదేశానిది. తెలుగు దేశం పార్టికి మద్దతుగాగత ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేశారు.  గెలిపించారు. ఇలాంటపుడు ఈ దుర్ఘటన కు  మీరు కూడా బాధ్యులు కాదా?'' అని  నన్ను ప్రశ్నించాడు.

‘ ఆ లోచిస్తే ఆ ప్రశ్నలో సహేతుకత ఉందనిపించిందిచ’అని వపన్ అన్నారు.

‘ఆ అక్రమ రవాణా చేస్తున్న  పడవ ప్రమాదంతో 21 మంది,  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ కారణంగా ఆ సంస్థ ఉద్యోగి వెంకటేశ్‌ ఆత్మహత్య దుర్ఘటనలలో నా వంతు బాధ్యత కూడా ఉందని అంగీకరిస్తున్నా,’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

‘వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు  వెళ్తున్నా' నని పవన్‌ విజయవాడలో నిన్న అన్నారు.  తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో యువకుల్లో బాగా నిరాశ నిస్పృహలున్నాయని కూడా ఆయన అన్నారు.

వారిని జాగృతం చేసేందుకు చ‌లో రే చ‌లో రే చ‌ల్‌ గీతాన్ని జనం లోకి తీసుకువెళుతున్నట్లు ఆయన  మరొక  ఒక ప్రకటనలో చెప్పారు.  ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటిస్తారు.  ఉద్యోగం రాక నిరాశకు లోనై ఆత్మార్పణ చేసుకున్న ఉస్మానియా విద్యార్థి మురళి సోదరుడితో ఆయన మాట్లాడారు. యువకులు ఇలా నిరాశ లకు లోను కాకుండా చూడాల్సిన బాధ్యత  రెండు తెలుగు ప్రభుత్వాల మీద ఉందని ఆయన పేర్కొన్నారు.

 

click me!