దక్షిణం నలుపా... ఉత్తరం అహంకారం: పవన్ ఆగ్రహం

First Published Apr 8, 2017, 6:13 AM IST
Highlights

 ‘నల్లగా వున్నవి వద్దనుకుంటే కోకిలను నిషేధించండి. మీరు ఎగరేసే జాతీక పతాకం ఒక దక్షిణాది మహనీయుడి రూలకల్పనే.. ఉత్తరాది అహంకారం మొత్తం మీ మాటల్లో కన్పిస్తాంది. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మర్చిపోయే అవమానం కాదిది. ఇలాంటి వివక్షలు జాతిని గీతలు గీసి మరీ విడదీస్తాయి’

బిజెపి నేత తరుణ్ విజయ్ దక్షిణాదివాళ్లని  నల్లోళ్ల ని చేసిన వ్యాఖ్య మీద జనసేన నేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉత్తరాది అ హంకారం అని ఆయన వ్యాఖ్యానించారు. చాలా కాలంగా ఉత్తరాది దక్షిణాదిని చిన్నిచూపుస్తున్నదన వపన్ విమర్శిస్తూనే ఉన్నారు. ఆంధ్ర ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వెనక కూడా ఇదే పెత్తనం వుందని ఆయన అంటూ వచ్చారు. ఇపుడు ఉత్తరాది నాయకుల అందునా బిజెపి నాయకులమైండ్ సెట్ ను బయటపెడతే తరుణ్ విజయ్ కామెంట్ చేయడం పవన్ ఉత్తర భారత్ విధానం బలాన్నిచ్చింది. అయితే,బిజెపి పట్ల ఆయన వైఖరిలో మార్పుతెస్తుందా లేక ఇది తరుణ్ విజయ్ పైత్యంగా మాత్రమే పరగణిస్తారో తెలియదు.

 

 నల్ల ని వన్నీ వద్దనుకుంటే కోకిలను నిషేధించాల్సి ఉంటుందని  పవన్‌ అన్నారు.   బిజెపి ఎంపి తరుణ్ విజయ్ దక్షిణ భారతీయులను  ఉద్దేశిస్తూ జాతి వివక్ష విషం చిమ్మటం పై పవన్‌ ట్విటర్‌ ద్వారా సమాధానమిచ్చారు.

 

అల్ జజీరా టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్‌ విజయ్‌ ‘ఒకవేళ మాకే  జాత్యాహంకారమనేది ఉంటే  నల్ల గా ఉండే దక్షిణ భారతీయులతో ఎలా కలిసుంటాం.. మా చుట్టూ కూడా నల్లజాతోళ్లున్నారు గా,’ అని అసహ్యమయిన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారత దేశమ్మీదఇంతవరకు ఇలాంటి వ్యాఖ్యలెవరూ చేయలేదు. ఆపై నాలుక్కొరుక్కుని అతగాడు క్షమాపణలు కోరడం వేరే విషయం.

 

ఈ ధోరణినే  పవన్‌ ట్విటర్‌లో వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 ‘నల్లగా వున్నవి వద్దనుకుంటే కోకిలను నిషేధించండి. మీరు ఎగరేసే జాతీక పతాకం ఒక దక్షిణాది మహనీయుడి రూలకల్పనే.. ఉత్తరాది అహంకారం మొత్తం మీ మాటల్లో కన్పిస్తాంది. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మర్చిపోయే అవమానం కాదిది. ఇలాంటి వివక్షలు జాతిని గీతలు గీసి మరీ విడదీస్తాయి’ అని పవన్ హెచ్చరిక చేశారు.

 

click me!