నోట్ల రద్దు తర్వాత ఎంత బంగారం కొన్నారంటే..

Published : Jan 02, 2017, 01:42 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
నోట్ల రద్దు తర్వాత ఎంత బంగారం కొన్నారంటే..

సారాంశం

ఢిల్లీ, ముంబైలలో అత్యధికంగా కొనుగోళ్లు

 

పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత బంగారం ధర ఒడిదుడుకులకు లోనైంది. చేతిలో ఉన్న నోట్లన్నీ రద్దు కావడంతో అన్ని కొనుగోళ్లు భారీగా మందగించాయి.

 

అయితే నవంబర్ 8 నుంచి  ( పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత ) బంగారం కొనుగోళ్లు మాత్రం అమాంతం పెరిగాయట.

 

 

ఇప్పటి వరకు ఎంత బంగారం అమ్మకాలు సాగాయి అనే దానిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇంటిలిజెన్స్ ఓ సర్వే జరిపింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.

 

 

నవంబర్ 8 నుంచి రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు  4 టన్నుల బంగారం అమ్మడైపోయిందట.

దీని విలువ రూ.1,500 కోట్లకు పై మాటే.

 

రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోడానికి బంగారానికి మించిన మరో ప్రత్యామ్నాయం నల్లదొరలకు కనిపించలేదని దీన్ని బట్టి తెలుస్తోంది.


 ముఖ్యంగా ముంబై, ఢిల్లీలో అత్యధికంగా బంగారం కొనుగోళ్లు జరిగాయట.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu