ప్రభాస్ ‘సాహో ’ హక్కుల కోసం పోటీ..!

Published : Aug 14, 2017, 05:32 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ప్రభాస్ ‘సాహో ’ హక్కుల కోసం పోటీ..!

సారాంశం

ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేయడానికి చిత్ర బృందం  సన్నాహాలు చేస్తోంది

 

‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్.. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. దీంతో ఆయన క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు.. కాగా.. ఈ చిత్ర హక్కుల కోసం రెండు ఆన్ లైన్ సంస్థలు ఇప్పటి నుంచే పోటీలు పడుతున్నాయి.

ప్రముఖ ఆన్ లైన్ సంస్థలు నెట్ ఫిక్స్, అమేజాన్ లు సాహో హక్కులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో  ఉంచుకొని.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం  సన్నాహాలు చేస్తోంది. కాగా.. మూడు భాషల్లో కలిసి ఈ చిత్ర హక్కుల కోసం నెట్ ఫిక్స్ సంస్థ రూ.50కోట్లు  ఇవ్వడానికి సిద్ధపడినట్లు సమాచారం. అదేవిధంగా అమేజాన్ కూడా హక్కుల కోసం పోరాడుతోందట. అయితే.. ఈ విషయంపై ఇప్పటి వరకు సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఎలాంటి  అధికారిక ప్రకటన చేయలేదు.

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం ఇదే కావడంతో ‘సాహో’ పై అంతటా. అంచనాలు పెరిగిపోయాయి. రూ.150కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కథనాయిక పాత్రకు బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ని తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !