టీడీపీకి నంద్యాల ‘సీటు’ పోటు

Published : Apr 30, 2017, 10:03 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
టీడీపీకి నంద్యాల ‘సీటు’ పోటు

సారాంశం

ఒకరికిస్తే మరొకరు పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్న భయం అధినేత కు పట్టుకున్నట్లుంది.

క్రమశిక్షణ గల టీడీపీ పార్టీలో నంద్యాల రూపంలో ముసలం బయలుదేరేలా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో ఆ సీటు ఎవరికిచ్చినా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితే కానవస్తోంది.

 

ఒకరికిస్తే మరొకరు పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్న భయం అధినేత కు పట్టుకున్నట్లుంది. అందుకే ఇంకా అభ్యర్థి పేరు ప్రకటించేందుకు ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు.

 

టికెట్‌ తమకే ఇవ్వాలని శిల్పాబ్రదర్స్‌ కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోరు పెడుతూనే ఉన్నారు. ఈ రోజు వాళ్లు స్వయంగా సీఎంను కలిసి మరోసారి ఈ విషయంపై చర్చించారు.

 

2014 ఎన్నికల్లో పార్టీ తరఫున తానే పోటీ చేశాను కాబట్టి టికెట్ తనకే ఇవ్వాలని శిల్పామోహన్‌రెడ్డి పట్టుబడుతున్నాడు.  ఈసారి కూడా టికెట్‌ తనకు ఇవ్వడమే న్యాయమని బాబు దగ్గర మొరపెట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన వాదనలోనూ నిజం లేకపోలేదు.

 

అయితే మంత్రి అఖిల ప్రియ కూడా ఆ సీటు తమ కుటుంబానికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆమె కూడా ఈ వ్యవహారంపై ఈ రోజే సీఎంను కలిశారు. సంప్రదాయం ప్రకారం టికెట్‌ తమకు ఇవ్వడమే న్యాయం అని ఆమె వాదన. ఇందులోనూ న్యాయం ఉంది. అందుకే చంద్రబాబు ఇద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించాలో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటి వరకు తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !