ఈ రోజు ఆంధ్రలో 2018 తొలి రాజకీయ వింత

First Published Jan 3, 2018, 11:27 AM IST
Highlights

జగన్  చంద్రబాబు జిల్లాలో ఉంటే ఇక్కడ చంద్రబాబు జగన్ జిల్లాాలో  పర్యటన

ఈ రోజొక విచిత్రం జరుగుతున్నది ఆంధ్రలో. ఇది 2018 తొలి రాజకీయ విచిత్రం

ప్రతిపక్ష నాయకుడు  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా చిత్తూరు లో  ప్రజాసంకల్ప యాత్ర చేస్తూ ఉంటే, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత జిల్లాలో ప్రవేశించారు.

అక్కడ చిత్తూరు జిల్లాలో నాయుడు వైఫల్యాలను జగన్ తూర్పారబడుతూ ఉంటే, ఇక్కడ కడపలో  ముఖ్యమంత్రి నీటిపారుదల ప్రాజక్టుల పరిశీలనలో ఉన్నారు. ఇవే వివరాలు:

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.  పులివెందుల కు, కడప జిల్లాలకు ముఖ్యమంత్రి గా రాజశేఖర్ రెడ్డి కూడాచేయలేని పనులను తాను చేస్తున్నానని ముఖ్యమంత్రి వివరిస్తున్నారు. 2019లో ఆయన పులివెందులో పచ్చ జెండా ఎగరేయాలనుకుంటున్నారు. ఇదే ద్యేయంతో ఆయన ఈ మధ్య కడప జిల్లాలో పర్యటలను పెంచారు. అయితే, ఈసారి ఆయన జగన్ చిత్తూరు జిల్లాలో ఉన్నపుడు, తనను విమర్శిస్తున్నపుడు పులివెందులకు వచ్చి తన అభివృద్ధి గురించి చెబుతున్నారు.

 ఉదయం 11.40కి లింగాల మండలం పార్నపల్లెకు చేరుకుని అక్కడ చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. 

ఈ ఏడాది 33 టీఎంసీల కృష్ణా జలాలను జిల్లాకు తీసుకువచ్చి గండికోట, బ్రహ్మంసాగర్‌, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లను నీటితో నింపారు. 

పార్నపల్లె వద్ద ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పులివెందుల బ్రాంచి కెనాల్‌కు సీఎం నీటిని విడుదల చేయనున్నారు. 

మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పులివెందులలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారు.

ఇక అటువైపు  జగన్  చేపట్టిన పాదయాత్ర నేడు  51వ రోజుకి చేరుకుంది. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా జమ్మిలవారిపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభించారు.  తెలుగుదేశం వైఫల్యాలను, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఆయన విమర్శిస్తున్నారు. తన ముఖ్యమంత్రి అయితే, ఏమి చేస్తాడో అవన్నీ వివరిస్తున్నారు. సొంత  జిల్లా చిత్తుూరు  జిల్లాకు ముఖ్యమంత్రి ఏమి చేయలేదని, అందుకే తన యాత్రకు ప్రజల వివరీతంగా వస్తున్నారని, వారంతా మార్పు కోరుతున్నారని జగన్ చెబుతున్నారు.

click me!