
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం లేకపోయినా ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వయత్నం చేసింది. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన ఎమ్మెల్యేలను సమకూర్చుకునే ప్రయత్నంలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
బీజేపీ నాయకులు యడ్యూరప్ప, శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి తదితరులు మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో టేపులు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ నేత ఉగ్రప్ప స్పందిస్తూ, ఆ ఆడియో టేపులన్నీ ఒరిజినల్ అని చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో వాటిని టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు .
అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు కష్టాలు తప్పేలా లేవు అనే అభిప్రాయం వ్యక్తంమవుతోంది. ఆ టేపులు నిజం అని తేలితే.. బీజేపీ నాయకులను అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.