ఇవాంక హైదరాబాద్ పర్యటనపై మోదీ క్లారిటీ..

Published : Aug 11, 2017, 04:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఇవాంక హైదరాబాద్ పర్యటనపై మోదీ క్లారిటీ..

సారాంశం

ఈ సమ్మిట్ లో ఇవాంక ట్రంప్ పాల్లొంటారని మోదీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. కొద్ది గంటల్లోనే ట్రంప్, ఇంవాకా ఇదే విషయంపై ట్విట్టర్ లో స్పందించారు.

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె… సలహాదారు ఇవాంక ట్రంప్ త్వరలోనే హైదరాబాద్  రానున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. నవంబర్ 28న హైదరాబాద్ లో గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌ (జీఈఎస్) జరగనుంది. ఈ సమ్మిట్ లో ఇవాంక ట్రంప్ పాల్లొంటారని మోదీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. స్టార్టప్ ఇండియాలో భాగస్వామ్యం ఉన్న భారతీయలకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.మోదీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్, ఇంవాకా ఇదే విషయంపై ట్విట్టర్ లో స్పందించారు.

 ఇవాంకా ట్రంప్.. భారత్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్ షిప్ కి అమెరికా తరపున ప్రాతినిధ్యం వహిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

 

 ‘‘భారత్‌లో జరగబోయే జీఈఎస్ 2017కు అమెరికా ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించడం, ప్రధాని మోదీతో పాటు ప్రపంచ వాణిజ్యవేత్తలతో సమావేశమయ్యే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా..’’ అని ఇవాంక ట్వీట్  చేశారు.

2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సదస్సును మొదట  వాషింగ్టన్ లో ప్రారంభించారు. భారత్  ఈ సదస్సును నిర్వహించడం ఇదే తొలిసారి.ఈ సదస్సు నిర్వహణ కోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు కూడా పోటీ పడగా.. సదస్సు నిర్వహించే అవకాశం చివరికి  హైదరాబాద్ కే దక్కింది. కేంద్రం సూచనల మేరకు గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌ నిర్వహణకు  నీతి ఆయోగ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ కార్యక్రమంలో హెచ్1బీ వీసాల అంశాన్ని భారత్ అమెరికా దృష్టికి తీసుకురానుంది.

 

సదస్సులో వర్క్ షాప్‌లను విస్తృత స్థాయిలో నిర్వహించనున్నారు. 2010లో జరిగిన తొలి సదస్సుకు వాషింగ్టన్ ఆతిథ్యం ఇవ్వగా.. తర్వాతి ఏళ్లలో ఇస్తాంబుల్, దుబాయ్, కౌలాలంపూర్, నైరోబీ, సిలికాన్ వ్యాలీల్లో వరుసగా ఈ సదస్సును నిర్వహించారు. స్టారప్ట్‌ ఇండియాలో భాగస్వామ్యం ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ సదస్సులో మహిళా వ్యాపారవేత్తల పురోగతిపై దృష్టి సారించనున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !