‘మెట్రో రైల్’ శ్రీధరన్ కు అవమానం

First Published Jun 15, 2017, 3:11 PM IST
Highlights

ఇండియాలో మెట్రో అంటే ఇ. శ్రీధరన్. ఆయనతో సంప్రదించకుండా, ఆయన సలహా తీసుకోకుండా,ఎంతో కొంత ఆయన పాత్ర లేకుండా ఇండియాలో ఇపుడు మెట్రో రైలు నిర్మాణం కష్టం.ఇలాంటి శ్రీధరన్ కు  తాను అడ్వయిజర్ గా పూర్తి చేసిన కొచ్చి మెట్రో రైలు ప్రారంభోత్సవ సభలో సీటు లేకుండా చేసి అవమానించారు.

ఇండియాలో మెట్రో అంటే ఇ. శ్రీధరన్. ఆయనతో సంప్రదించకుండా, ఆయన సలహా తీసుకోకుండా,ఎంతో కొంత ఆయన పాత్ర లేకుండా ఇండియాలో ఇపుడు మెట్రో రైలు నిర్మాణం కష్టం. హైదరాబాద్ మెట్రో కావచ్చు. విజయవాడ మెట్రోకావచ్చు లేదా కొచ్చి మెట్రో కావచ్చు.ఏదో ఒక దశలో ఆయన సలహాలు అవసరమయి ఉంటాయి. హైదరాబాద్ మెట్రో కడుతున్నది ఎల్ అండ్ టి యే అయినా, మొట్టమొదట దీనికి డిపిఆర్ తయారుచేసి ఇచ్చింది ఆయనే.  ప్రభుత్వాలు అపుడు చకచకా మారిపోవడం, ప్రయారిటీలు మారిపోవడంతో ఆలస్యమయింది. తర్వాత అది ఎల్ అండ్ టి కి వెళ్లిపోయింది.

మెట్రో శ్రీధరన్ కు ఆంధ్రతో చాలా అనుబంధం ఉంది. ఆయన చదివింది కాకినాడు ఇంజనీరింగ్ కాలేజీలోనే.

తాజాగా ఆయన నిర్మించిన మెట్రో కేరళకు చెందిన కొచ్చి మెట్రో రైల్ (కెఎంఆర్). ఇది వచ్చే శనివారం ప్రారంభమవుతుంది. అయితే, ప్రారంభం కార్యక్రమసమయంలో ఆయనను వేదిక మీద లేకుండా చేశారు.  ప్రధాని మోదీ మెట్రో రైలు నుజూన్ 17న ఉదయం 11 గం.కు ప్రారంభిస్తున్నారు.

వేదిక మీద ఆయన అవసరం లేదని ప్రధాని కార్యాయం జాబితానుంచి ఆయన పేరు తొలగించింది.

కొచ్చి మెట్రో రైల్ అడ్వయిజర్ అయిన శ్రీధరన్ పేరును కెఎంఆర్ అధికారులు వేదిక మీదకు ఆహ్వానించాల్సిన వారి జాబితాలో  చేర్చారు. అయితే, ప్రధాని కార్యాలయం మాత్రం ఆయన పేరును తీసేసింది.

‘‘నా పేరు తీసేయడం అవమానమని నేను భావించడం లేదు,’’ అని శ్రీధరన్ అన్నారు.

‘‘నేను తప్పకుండా శనివారం జరిగే కొచ్చిన మెట్రో రైల్ ప్రారంభానికి  వస్తాను. నా పేరు తీసేయడాన్ని వివాదం చేయదల్చుకోలేదు. ప్రధాని భద్రత అనేది చాలా ముఖ్యం. సెక్యూరిటీ సంస్థల సూచనల మేరకే అధికారులను నాపేరు తీసేసి ఉంటారు,’’ అని ఆయన సర్ధి చెప్పుకు వచ్చారు. 

 ఈ కార్యక్రమం నుంచి రెండు పేర్లను ప్రధాని కార్యాలయం తొలగించింది.ఒకటి ఇ. శ్రీధరన్ పేరు కాగా రెండోది ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు రమేశ్ చెన్నితాల ది.

జూన్ 17 న ప్రారంభించడానికి ముందే ప్రధాని మోదీ మెట్రో రైలు లో ప్రయాణించి నిర్మాణాన్ని పరితీరును పరిశీలిస్తారు.

ప్రధాని మెట్రోరైలులో పాలారివట్టం నుంచి పాతాడిపాళెం దాకా ప్రయాణిస్తారు.


 

 

 

click me!