
ఇక మీరు కూడా హీరో కావొచ్చు... కాలేరు అని ఎవరైనా అంటే ఈ వీడియో చూపెట్టండి..
హీరో కావాలంటే.. కండలు తిరిగిన దేహం... ఆరడుగుల అందం.. అవసరంలేదని నిరూపించాడు ఈ మెగా పవర్ యూట్యూబ్ స్టార్..
బంగ్లాదేశ్ కు చెందిన ఆలం అనే ఈ యువకుడు తన యూట్యూబ్ వీడియోలతో ఎందరికో స్ఫూర్తినిస్తున్నాడు
ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ గ్రామీణ కుర్రాడి వీడియోలు ఒక సంచలనం.
బంగ్లాదేశ్ లోని బొగ్రా అనే చిన్న గ్రామానికి చెందిన ఆలం మొదట్లో ఒక సీడీ షాపు పెట్టాడు. అది కాస్త దివాళా తీయడంతో ఊరికి కేబుల్ టీవీ ఆపరేటర్ గా మారాడు. ఇవేవీ ఆయనకు సంతృప్తినివ్వలేదు.
దీంతో తనలోని నటుడిని బయటకు తీశాడు. డ్రామాలు, డ్యాన్స్ లతో ఇరగదీసి వాటిని యూట్యూబ్ లో పెట్టాడు.
8 ఏళ్ల అతడి కృషి ఫలించింది. ఇప్పుడు యూట్యూబ్ లో ఆ వీడియోలు వైరల్ గా దూసుకెళ్తున్నాయి.
ఇప్పటికే 4.3 మిలియన్ల మంది వాటిని చూశారు.
ఇప్పడంతా ఆలంను యూ ట్యూబ్ స్టార్ అంటున్నారు.
అయితే ఆలం మాత్రం తానేమీ హీరోను కాదని, జనాలను నవ్వించడానికే ఈ ప్రయత్నం చేసినట్లు చెప్పాడు.