ఆధునిక వాగ్గేయకారుడు మంగళంపల్లి ఇక లేరు

Published : Nov 22, 2016, 11:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ఆధునిక వాగ్గేయకారుడు మంగళంపల్లి ఇక లేరు

సారాంశం

ముందుముందు ఎంతో  మంది మహాగాయకులు రావచ్చు.  అయితే, మంగళంపల్లి లేని లోటు పూరించడం కష్టం

సంగీత ప్రియులను శోక సముద్రంలో ముంచి ముంగళంపల్లిగా ప్రపంచానికి సుపరిచితులైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కన్నుమూసారు.  కొద్ది రోజులుగా అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మంగళంపల్లి మంగళవారం మధ్యాహ్నం తన స్వగృహంలో చివరి శ్వాసవిడిచారు.తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరి మఠాలకు ఆయన అస్థాన విద్వాంసుడు కూడా. 

 

ఆధునిక వాగ్గేయకారుడయిన బాల మురళీకృష్ణ 1930 జూలై 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలో జన్మించిన మంగళంపల్లి మొత్తం మీద దేశ, విదేశాల్లో 25 వేల కచేరీలు చేసారు. భక్త ప్రహ్లాద లాంటి సినిమాల్లో వెండి తెరమీద కూడా కనిపించారు. 400 సినీగీతాలకు సంగీతాన్ని అందించారు. 1976, 87లో నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను కూడా అందుకున్నారు. 


ఆయన తండ్రి పట్టాభిరాయమ్య కూడా వేణువు,వీణ వాయిద్య కారుడు. మంగళం పల్లి సంగత ప్రవేశం ఇంటి దగ్గిర నుంచే మొదలయింది.చిన్న తనంలోనే కుమారుడికి సంగీతం పట్ల ఉన్న మక్కువ ను చూశాక తండ్రి అతనిని పారుపల్లి రామకృష్ణ పంతులు దగ్గిర చేర్పించారు. ఎనిమిదవ యేటనే తన మొదటి కచేరి నిచ్చారు.  చాలా కాలం ఆయన ఆకాశవాణి కేంద్రాలలో పనిచేశారు. ఇలా పనిచేస్తున్నపుడే ఆయనకు మదరాసు ఆకాశ వాణి కేంద్రానికి బదిలీ అయింది. అప్పటినుంచి ఆయనకు మదరాసే సొంతవూరయింది. దేశంలోని ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆయన గౌరవ డాక్టరేట్ పట్టాలను బహూకరించాయి.

 

సంగీత కళానిధి,నారద మహర్షి వంటి బిరుదుల కూడా ఇచ్చారు. ఆయన ఎన్నో సినిమాలలో తన దైన శైలిలో పాడారు. ఉత్తమ నేపథ్యగాయకుడి గా కూడా ఎంపికయ్యారు. సంగీత సిద్ధాంతంలో పరిశోధనలు చేసేందుకు ఆయన తనపేరు మీద ఎంబికె ట్రస్టును కూడా ఏర్పాటు చేశారు. సినిమా, శాస్త్రీయ సంగీతాల మీద తులనాత్మక పరిశోధన కూడా చేశారు. అది దూరదర్శన్ ప్రసారమయిన బాగా మన్ననలు పొందింది. విజయవాడలోని ప్రభుత్వ సంగీత కళాశాలకు మొదటి ప్రిన్సిపల్ గా నియమితులయ్యారు. మరుగున పడిపోయిన  లవంగి,మహతి, మనోరమ,మురళి, గోదావరి, రోహిణి, సుముఖం వంటి రాగాలను ఆయన పునరద్ధరించి సంగీత ప్రపంచానికి అందించారు.1991లో ఆయనకు పద్మ విభూషణ్ పురష్కారం లభించింది.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !