
ఓ వ్యక్తి సినీ ఫక్కిలో కిడ్నాప్ డ్రామా ఆడాడు.. కన్న బిడ్డను డబ్బు కోసం వేరేవరికో అమ్మి.. గుర్తు తెలయని వాళ్లు కిడ్నాప్ చేశారంటూ భార్య నమ్మించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా అతను ఆడిన హైడ్రాను పోలీసులు బయటపెట్టారు. ఈ ఘనట హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పాతబస్తీలోని డబీర్ పురాకు చెందిన మస్తాన్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవితం సాగిస్తున్నాడు. అతనికి భార్య రిజ్వానా.. 9 నెలల కుమార్తె ఉన్నారు. వారం రోజుల క్రితం మస్తాన్..తన భార్య, కుమార్తెతో కలిసి అత్తాపూర్ లోని కల్లుకాంపౌండ్ కి వచ్చాడు. అక్కడ భార్య భర్తలు ఇద్దరూ కల్లు తాగి మద్యం మత్తులో పడిపోయారు. మత్తు వదిలిన తర్వాత లేచి చూస్తే.. పాప కనిపించలేదు. మస్తాన్, రిజ్వానా.. ఇద్దరూ పాప కోసం చుట్టుపక్కల వాకబు చేశారు.అయినా పాప జాడ తెలియలేదు. దీంతో పాపను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యదు చేశారు. మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. పాప కిడ్నాప్ విషయాన్ని చుట్టుపక్క పోలీసు స్టేషన్ లకు కూడా సమాచారం ఇచ్చారు. కాగా.. ఓ దంపతుల వద్ద 9 నెలల చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. మస్తాన్ పై కూడా పోలీసులు నిఘా పెట్టారు. దీంతో అసలు విషయం బయట పడింది.
మస్తాన్ .. డబ్బు కోసం కన్న కూతురిని అమ్మకానికి పెట్టినట్లు తేలింది. పథకం ప్రకారమే భార్యను కల్లు కాంపౌండ్ కి తీసుకు వచ్చి.. పాప కిడ్నాప్ గురైనట్లు నాటకమాడాడని పోలీసులు చెప్పారు. దంపతుల వద్ద నుంచి మస్తాను రూ.46వేలు తీసుకున్నట్లు వారు చెప్పారు. పాపను అమ్మినందుకు మస్తాన్ ని, కొన్న దంపతులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మస్తాన్ వద్ద నుంచి రూ.14వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిన్నారి తల్లి రిజ్వానాకు అప్పగించారు.