పారదర్శకత లేకపోవటమే అసలు సమస్య

Published : Dec 03, 2016, 03:43 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
పారదర్శకత లేకపోవటమే అసలు సమస్య

సారాంశం

ప్రధాని, ఆర్బిఐ, అరుణ్ జైట్లీ తదితరులు చెబుతున్న మాటలపై ప్రజలకు నమ్మకం కలగటం లేదు. రోజుకో మాట చెబుతూ, పూటకో నిబంధనను విధిస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారు.

దేశంలోని అత్యున్నత వ్యక్తుల పారదర్శకతపైన కూడా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత తలెత్తిన పరిణామాలతో ఇటు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు రిజర్వ్ బ్యాంకు పారదర్శకతపైన కూడా ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

 

ఎందుకంటే, మోడి, జైట్లీ వ్యవహారశైలిపైన దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పై స్వయంగా బ్యాంకుల సంఘాల నేతలే పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతున్న విషయం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఒక సంఘం ఉర్జిత్ ను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తుంటే, మరో సంఘం బ్యాంకులకు పంపుతున్న డబ్బులపై ఏకంగా ఆర్బిఐనే లెక్కలు అడుగుతుండటం విశేషం.

 

దేశంలోని 127 కోట్ల జనాభాకు సంబంధించిన అంశం మీద మరింత పారదరదరదర్శకత అవసరమని ఢిల్లీ పెద్దలకు తెలీదా. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో తలెత్తిన సంక్షోభంతో యావత్ దేశ ప్రజలూ గడచిన 24 రోజులుగా తల్లడిల్లిపోతున్నారు. ఒక్కసారిగా పెద్ద నోట్ల రద్దు చేయటం, చిన్న నోట్లు చెలామణిలో సరిపడా లేకపోవటంతో దేశంలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది. ఇందుకు ప్రధానమంత్రి, ఆర్బిఐలదే పూర్తి బాధ్యత.

 

ఈ నేపధ్యంలోనే ప్రధాని, ఆర్బిఐ, అరుణ్ జైట్లీ తదితరులు చెబుతున్న మాటలపై ప్రజలకు నమ్మకం కలగటం లేదు. రోజుకో మాట చెబుతూ, పూటకో నిబంధనను విధిస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారు. అసలు, రద్దైన మొత్తం కరెన్సీ ఎంత, నిల్వున్న నగదు ఎంత, ఇపుడు ముద్రిస్తున్న నగదు ఎంత అన్న విషయంలో అటు ఆర్బిఐ ఇటు కేంద్ర ఆర్ధికశాఖలు చెబుతున్న మాటలను ఎవరూ నమ్మటం లేదు.

 

ప్రజావసరాలకు సరిపడా నగదు నిల్వలు ఉన్నాయని ఆర్బిఐ, అరుణ జైట్లీ పదే పదే చెబుతున్నారు. అయితే, దేశంలో ఎక్కడ చూసినా నగదు కొరతే. నిజంగానే దేశంలో కావాల్సినంత నగదు నిల్వలుంటే, ఖాతాదారులకు కావాల్సినంత ఎందుకు ఇవ్వటం లేదన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ‘తమ డబ్బులు తాము తీసుకోవటానికి ఆంక్షలేమిట’ని ఖాతాదారులు అడుగుతున్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకున్నారు. దాంతో సరిపడా నగదు నిల్వలున్నాయన్న మాటలో నిజం లేదని తెలుస్తోంది.

 

ప్రైవేటు బ్యాంకులకు ఎక్కువ డబ్బులిస్తూ, జాతీయ బ్యాంకులకు తక్కువ డబ్బులిస్తున్నట్లు ఆర్బిఐపైనే బ్యాంకు అధికారులు ఆరోపణలు చేయటం గమనార్హం. అదేవిధంగా ప్రజావసరాలకు సరిపడా డబ్బును ఆర్బిఐ పంపటం లేదని అధికారుల సంఘం కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. దాంతోనే ఆర్బిఐ విశ్వసనీయత కోల్పోతోంది. క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను వెంటనే చక్కదిద్దకపోతే కేంద్రప్రభత్వం, ఆర్బిఐ ప్రజా విశ్వాసం కోల్పోవటానికి ఎక్కువ రోజులు పట్టదన టంలో ఎటువటం సందేహం అక్కర్లేదు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !