కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published : Feb 04, 2018, 11:53 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సారాంశం

కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం ఎడ్లబండిని ఢీకొట్టిన లారీ ముగ్గురు మృతి, మరో ఇద్దరికి గాయాలు

 కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలమనూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఎడ్లబండిని ఎదురుగా వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బండిలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే బలమనూరుకు చెందిన ఉప్పరి సుబ్బారాయుడు తన కుటుంబంతో కలిసి ఎండ్లబండిపై పొలానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బండి జాతీయ రహదారిపై వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఎడ్లబండి ఎగిరి రోడ్డుపక్కన పడింది. ఈ ప్రమాదంలో సుబ్బారాయుడు, అతడి భార్య నాగలక్ష్మమ్మ తో పాటు వారి కూతురు సుజాత అక్కడికక్కడే మృతి చెందారు. మరో కూతురు సుమతితో పాటు షాకీర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు.  ఈ ప్రమాదంలో రెండు ఎద్దులు కూడా అక్కడికక్కడే చనిపోయాయి.
 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu