టీడీపీలో చేరనున్న ప్రధానమంత్రి మోదీ !

Published : Jan 18, 2017, 10:42 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
టీడీపీలో చేరనున్న ప్రధానమంత్రి మోదీ !

సారాంశం

తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించకుండా ఆప్ నేత కుమార్ విశ్వాస్ వెరైటీగా ట్వీట్ చేసి కమలనాథులకు షాకిచ్చారు.

ప్రధానమంత్రి మోదీ తెలుగు దేశం పార్టీలో చేరుతున్నారట. బహుశా చంద్రబాబు కూడా ఈ వార్తను నమ్మరు. కానీ, ఈ వార్త ఇప్పుడు నేషనల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఎందుకో తెలుసా...

 

అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకస్తుడు, ఆప్ నేత కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తల నుంచి ఇవి ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఈ కామెంట్లపై స్వతహాగా కవి అయిన కుమార్ విశ్వాస్ తనదైన శైలీలో విరుచుకపడ్డారు.



‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాన మంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ టీడీపీలో చేరబోతున్నారని తెలిసింది. దీనిని వార్తాకథనంగా ప్రసారం చేయండి. మీలాగే జోక్‌ చేస్తున్నా గైస్‌’ అంటూ కొన్ని మీడియా సంస్థలను ఎద్దెవా చేస్తూ ట్వీట్‌ చేశారు.

 

అంతేకాదు  మోదీ ’సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌’ పెంచుకోమని చెప్తే ఆయన భక్తులు మాత్రం ‘సెన్స్‌ ఆఫ్‌ రూమార్‌’ను పెంచుకుంటున్నారని అన్నారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu